Home > క్రీడలు > Muttiah Muralitharan: హైదరాబాద్ గురించి ముత్తయ్య మురళీధరన్ ఏం చెప్పాడంటే..

Muttiah Muralitharan: హైదరాబాద్ గురించి ముత్తయ్య మురళీధరన్ ఏం చెప్పాడంటే..

Muttiah Muralitharan: హైదరాబాద్ గురించి ముత్తయ్య మురళీధరన్ ఏం చెప్పాడంటే..
X

హైదరాబాద్ మహానగరంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శ్రీలంక లెజెండరీ క్రికెటర్, రైటార్మ్ స్పిన్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్. తనకు హైదరాబాద్ ఫుడ్ అంటే చాలా ఇష్టమని చెప్పిన ఆయన.. హైదరాబాద్‌లో ఉన్నన్ని రోజులు తాను చాలా సంతోషంగా గడిపానని అన్నారు. ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 800 సినిమా రేపే(అక్టోబర్ 6వ తేదీన) విడుదల కాబోతోంది. ఈ స్పోర్ట్స్ డ్రామాలో మాధుర్ మిట్టల్ లీడ్ క్యారెక్టర్‌లో నటించారు. ముత్తయ్య మురళీధరన్ పాత్ర ఆయనదే. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్ పతాకంపై వివేక్ రంగాచారి ఈ సినిమాను తెరకెక్కించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకుడు. ఘీబ్రాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో మహిమా నంబియార్, నాజర్.. కీలక పాత్రల్లో నటించారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాకు సమర్పకుడు.

ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోన్నారు ముత్తయ్య మురళీధరన్. ఇందులో భాగంగా 800 సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ.. తనకు హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు ఇష్టం అని చెప్పారు. హైదరాబాద్ ఫుడ్ కూడా కాస్త శ్రీలంక ఫుడ్ లాగానే స్పైసీగా ఉంటుందని, తనకు బాగా నచ్చుతుందని తెలిపారు. "మొదటిసారి హైదరాబాద్ వచ్చినపుడు సిటీ అంత పెద్దగా లేకుండేది. ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉండేది కాదు. ఇప్పుడు చూస్తే ఇండియాలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న సిటీ హైదరాబాద్‌ అనిపిస్తుంది. ఎక్కడ చూసిన భారీ బిల్డింగులు, విశాలమైన రోడ్లు కనిపిస్తున్నాయి" అని అన్నారు.

ఇక 800 బయోపిక్ విషయానికొస్తే.. సింహళీయుల ప్రాబల్యం అధికంగా ఉన్న శ్రీలంకలో తమిళుడైన ముత్తయ్య మురళీధరన్ ఎలా ఆ దేశ జాతీయ జట్టులో చోటు సంపాదించగలిగాడు? ఎలా సత్తా నిలదొక్కుకోగలిగాడు?, చిన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? అనే అంశాల చుట్టూ కథను అల్లుకుంది యూనిట్. 133 టెస్ట్ మ్యాచ్‌లల్లో 800 వికెట్లను పడగొట్టిన ఏకైక బౌలర్ ఆయనే. 350 వన్డే ఇంటర్నేషనల్స్, 12 టీ20 మ్యాచ్‌లల్లో శ్రీలంక జాతీయ జట్టు తరఫున ఆడాడు. అలాగే- ఐపీఎల్‌లో 66 మ్యాచ్‌ల్లో 63 వికెట్లు పడగొట్టాడు. ఆయన కేరీర్ మొత్తం ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Updated : 5 Oct 2023 10:07 AM IST
Tags:    
Next Story
Share it
Top