Home > క్రీడలు > ఇది చైనా క్రికెట్ స్టేడియం.. అందుకే ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నరు

ఇది చైనా క్రికెట్ స్టేడియం.. అందుకే ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నరు

ఇది చైనా క్రికెట్ స్టేడియం.. అందుకే ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నరు
X

ఏషియన్ గేమ్స్ 2023కి చైనా అతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో పాల్గొనేందుకు బీసీసీఐ టీమిండియా పురుషుల జట్టుకు అనుమతించింది. ఇటీవల ఈవెంట్ లో పాల్గొనే ప్లేయర్ల జాబితాను ప్రకటించి.. రుతురాజ్ గైక్వాడ్ ను కెప్టెన్ గా నియమించింది. ఇటు వన్డే వరల్డ్ కప్, అటు ఏషియన్ గేమ్స్ తో రెండు నెలలు క్రికెట్ ఫ్యాన్స్ కు పండగే ఉంటుంది. అయితే, ఓ వార్త మాత్రం భారత అభిమానులు ఫైర్ అవుతున్నారు. మరీ ఇంత దారుణమా అంటు చైనాను విమర్శిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

క్రికెట్ గ్రౌండ్ అంటే రౌండ్ గా ఉంటుంది. అక్కడక్కడ స్క్వేర్ షేప్ లో కనిపిస్తుంది. కానీ ఏషియన్ గేమ్స్ కోసం చైనా తయారుచేసిన క్రికెట్ స్టేడియం మాత్రం అన్నింటికీ భిన్నంగా ఉంది. ఓ పక్క నిటారుగా.. మరో పక్క రౌండ్ గా ఉండి, రోడ్డు నిర్మాణం కోసం కట్ చేసినట్లు కనిపిస్తుంది. హాంగ్ జౌలోని జెజియాంగ్ యూనివర్సిటీ ఆప్ టెక్నాలజీ పింగ్ ఫెంగ్ దీన్ని తయారుచేసింది. ఆ యూనివర్సిటీ గ్రౌండ్ లోనే క్రికెట్ మ్యాచ్ లు జరుగుతాయి. దీన్ని చూసిన క్రికెట్ ఫ్యాన్స్ క్రికెట్ స్టేడియం ఇలా కూడా ఉంటుందా? అని ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా.. ఈ స్టేడియం కెపాసిటీ కేవలం 12వేలు కావడంతో ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదంతా అటుంచితే.. క్రికెట్ ఫ్యాన్స్ కు మాత్రం పడగే. చిన్న బౌండరీల్లో సిక్సర్ల మోత మోగిస్తుంటే.. చూడాలని ఆశగా ఎదురుచూస్తున్నారు.





Updated : 17 July 2023 10:38 PM IST
Tags:    
Next Story
Share it
Top