Home > క్రీడలు > Asia cup 2023: ఆసియా కప్లో సంజూను కాదని.. ఆ యంగ్ స్టర్కు చోటు

Asia cup 2023: ఆసియా కప్లో సంజూను కాదని.. ఆ యంగ్ స్టర్కు చోటు

Asia cup 2023: ఆసియా కప్లో సంజూను కాదని.. ఆ యంగ్ స్టర్కు చోటు
X

వరల్డ్ కప్ కంటే ముందు టీమిండియాకు ఎదుటున్న పెద్ద పరీక్ష ఆసియా కప్. ఈ టోర్నీలో గెలవడమే కాదు.. మెరుగైన జట్టును వరల్డ్ కప్ కోసం ఎంపిక చేయాల్సి ఉంటుంది. అలాగని ఆసియా కప్ కోసం ప్రయోగాలు కూడా చేయకుండా చూసుకోవాలి. ఈ క్రమంలో టీమిండియాకు మిడిల్ ఆర్డర్ మరోసారి తలనొప్పిగా తయారయింది. ప్రస్తుతం గాయాల నుంచి కోలుకుంటున్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఆసియా కప్ జట్టులో ఉంటారో లేదే చూడాలి. వీళ్లిద్దరు లేకపోతే.. వాళ్ల స్థానంలో సంజూ శాంసన్, తిలక్ వర్మ ఇద్దరిట్లో ఒకరికి ఛాన్స్ లభిస్తుంది.

ఈ క్రమంలో మరో రెండు రోజుల్లో ఆసియా కప్ కు టీమిండియా జట్టును ప్రకటించనుంది. దాంతో వీళ్లలో ఎవర్ని తీసుకుంటారని చర్చలు నడుస్తున్నాయి. వెస్టిండీస్ సిరీస్ లో దారుణంగా విఫలం అయిన సంజూ శాంసన్ ను పక్కనబెట్టి తిలక్ వర్మకు ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ కేఎల్ రాహుల్ ఫిట్ అయితే తిలక్ వర్మతో మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ అవుతుందని భావిస్తున్నారు. వరుసగా అవకాశాలిస్తున్నా సద్వినియోగం చేసుకోలేకపోయిన సంజూను జట్టు నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అతని స్థానంలో కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలి అంటున్నారు. మంచి టెక్నిక్ తో అదరగొడుతున్న తిలక్ ను తుది జట్టులోకి తీసుకుంటే టీంకు మేలని బీసీసీఐ సెలక్టర్లను కోరుతున్నారు.

fans demad select Tilak Verma instead of Sanju Samson for Asia Cup

fans demad, Tilak Verma, Sanju Samson, Asia Cup2023, Asia Cup2023 team india squad, kl rahul, shreyas ayyar, select Tilak Verma, icc worldcup 2023,wc team

Updated : 17 Aug 2023 4:30 PM IST
Tags:    
Next Story
Share it
Top