Home > క్రీడలు > ICC Worldcup squad: వీళ్లు చేసిన తప్పేంటి.. పాపం అవసరానికి వాడుకుని వదిలేస్తున్నారు!

ICC Worldcup squad: వీళ్లు చేసిన తప్పేంటి.. పాపం అవసరానికి వాడుకుని వదిలేస్తున్నారు!

ICC Worldcup squad: వీళ్లు చేసిన తప్పేంటి.. పాపం అవసరానికి వాడుకుని వదిలేస్తున్నారు!
X

మరో 30 రోజుల్లో వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. 12 ఏళ్ల తర్వాత జరిగే ఈ మెగా టోర్నీకి యావత్ దేశం ఎదురుచూస్తోంది. ఇప్పటికే పలు దేశాలు తమ జట్లను ప్రకటించగా.. తాజాగా టీమిండియా 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. పూర్తిగా అనుభవజ్ఞులకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. గాయం నుంచి కోలుకుని ఆసియా కప్ లో పునరాగమనం చేసిన శ్రేయస్ అయ్యర్, పూర్తిగా కోలుకోని కేఎల్ రాహుల్ ను ఎంపిక చేశారు. దాదాపు ఆసియా కప్ జట్టునే ఎంపిక చేశారు. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ విభాగంలో సమానంగా జట్టును ఎంపిక చేశారు. బుమ్రా, షమీ, సిరాజ్ తో పేస్ బౌలింగ్ యూనిట్.. జడేజా, కుల్దీప్, అక్షర్ పటేల్ తో స్పిన్ బౌలింగ్ బలంగా ఉంది.అందొచ్చిన అవకాశాలను ఇషాన్ కిషన్ అందిపుచ్చుకోవడంతో మెగా టోర్నీల్లో అవకాశం దక్కించుకున్నాడు.

అయితే, కొంతమంది ప్లేయర్లకు బీసీసీఐ అన్యాయం చేసిందని అభిమానులు మండిపడుతున్నారు. అశ్విన్, చాహల్ లను పూర్తిగా పక్కనబెట్టారు. స్పెషలిస్ట్ సీనియర్ స్పిన్నర్స్ అశ్విన్, చాహల్ కు ఈసారి కూడా నిరాశ ఎదురైంది. ద్వైపాక్షిక సిరీస్ లు తప్పితే మెగా టోర్నీల్లో వీళ్లను పక్కనబెడుతున్నారు. అసలు ప్రాక్టీస్ లేని కేఎల్ రాహుల్ ను వరల్డ్ కప్ మెయిన్ స్క్వాడ్ లో ఎంపిక చేయడం పట్ల అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటి వరకు ఆడిన ఏ వన్డే సిరీస్ లో రాణించని సూర్యకుమార్ యాదవ్ కు కూడా అవకాశం వచ్చింది. యావరేజ్ వరంగా మెరుగ్గా ఉన్న సంజూ శాంసన్ ను పక్కన పెట్టారు. ఒక్క వెస్టిండీస్ సిరీస్ లో ఫెయిల్ అయినందుకు ఆసియా కప్, వరల్డ్ కప్ లకు దూరం చేశారు. సొంత గడ్డపై ఆడుతున్నందున.. నాలుగో పేసర్ ను ఆడించరు. జట్టుకు కావాల్సి మూడో పేసర్ గా హార్దిక్ పాండ్యా పనికొస్తాడు.కాబట్టి ప్రసిద్ద్ కృష్ణ, శార్దూల్ లను ఎంపిక చేయలేదు. ఏదేమైనా బీసీసీఐ ప్రకటించిన వరల్డ్ కప్ స్వ్కాడ్ తో అభిమానులతో సహా క్రికెట్ ఎక్స్ పర్ట్ కూడా అసంతృప్తిగా ఉన్నారు. మరోసారి రిస్క్ చేస్తూ అనవసరంగా కొంతమందిని ఎంపిక చేశారని మండిపడుతున్నారు.

భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్,కేఎల్ రాహుల్, హార్థిక్ పాండ్య (వీసీ), సూర్య కుమార్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్

Updated : 5 Sept 2023 4:51 PM IST
Tags:    
Next Story
Share it
Top