Home > క్రీడలు > అమితాబ్ బచ్చన్ను ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్.. ఫైనల్ మ్యాచ్ చూడొద్దంటూ

అమితాబ్ బచ్చన్ను ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్.. ఫైనల్ మ్యాచ్ చూడొద్దంటూ

అమితాబ్ బచ్చన్ను ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్.. ఫైనల్ మ్యాచ్ చూడొద్దంటూ
X

అసలే వరల్డ్ కప్.. పైగా సొంతవేదిక.. ఫైనల్ లో టీమిండియా.. జరుగుతుంది ప్రపంచంలోని అతిపెద్ద స్టేడియం అహ్మదాబాద్ లో.. ఇక లైవ్ లో మ్యాచ్ చూడాలని ఎవరికి ఉండదు. అందుకే దేశంలోని అభిమానులతో పాటు ప్రముఖులు కూడా పెద్దఎత్తున స్టేడియానికి వస్తారు. ఈ క్రమంలో బిగ్ బీ అమితాబ్ బచ్చనన్ ను దయచేసి మ్యాచ్ చూడొద్దని అభిమానులు కోరుతున్నారు. ఆయన చూసిన మ్యాచ్ లో భారత్‌ ఓడిపోతుందని, ఈ ఫైనల్ మ్యాచ్ కూడా అలానే జరిగే ప్రమాదం ఉంటుందన్నది వారి నమ్మకం. కాగా సెమీస్ లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం సాధించిన తర్వాత అమితాబ్ ‘నేను చూడనప్పుడే టీమిండియా మ్యాచ్ లు గెలుస్తుంద’ని ట్వీట్ చేశాడు. దాన్ని పరిగణంలోకి తీసుకున్న టీమిండియా క్రికెట్ అభిమానులు ఆయనను ట్రోల్ చేస్తున్నారు. దయచేసి ఫైనల్‌ చూడొద్దంటూ ఆయన్ని అభిమానులు కోరుతున్నారు. భారత్ కోసం మరో త్యాగం చేయాలని చెప్తున్నారు. దీనిపై స్పందించిన అమితాబ్ ‘ఫైనల్ మ్యాచ్ కు వెళ్లాలా? వద్దా? అని ఇప్పుడు ఆలోచిస్తున్నా’ అని ట్వీట్ చేశాడు. టీమిండియా ఆడుతున్నప్పుడు ఇలాంటి నమ్మకాలను అమితాబ్‌ పాటిస్తారని 2011లో ఆయన కొడుకు అభిషేక్‌ బచ్చన్ చెప్పాడు.

Updated : 18 Nov 2023 10:24 AM IST
Tags:    
Next Story
Share it
Top