స్టేడియంలో కొట్టుకున్న రోహిత్, హార్ధిక్ ఫ్యాన్స్! వీడియో వైరల్
X
ఐపీఎల్ 17వ సీజన్ లో మ్యాచ్ ల మధ్య పోరు రసవత్తరంగా మారుతోంది. చివరు వరకు ఉత్కంఠ కొనసాగుతోంది. ఆదివారం అహ్మదాబాద్ స్టేడియంలో ముంబై, గుజరాత్ మధ్య జరిగన మ్యాచ్ చివరి బాల్ వరకు వచ్చింది. చివరికి గుజరాత్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా సీజన్ స్టార్టింగ్ ముందు రోహిత్ శర్మను కెప్టెన్ గా తప్పించిన ముంబై.. గుజరాత్ నుంచి హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేసుకుని పగ్గాలు అప్పగించింది. అయితే అప్పటి నుంచి ముంబై, రోహిత్ శర్మ ఫ్యాన్స్ హార్దిక్ పాండ్యాపై కోపంగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఫ్రాంచైజీ, పాండ్యాను ట్రోల్ చేస్తున్నారు.
కాగా నిన్నటి మ్యాచులో అభిమానులు రోహిత్ శర్మకు బ్రహ్మరథం పట్టారు. ఫీల్డింగ్, బ్యాటింగ్ చేస్తున్న టైంలో రోహిత్.. రోహిత్ అంటూ నినాదాలు చేశారు. హార్దిక్ బ్యాటింగ్, బౌలింగ్ చేస్తున్నప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయింది. దీంతో ఫ్యాన్స్ ముంబై ఫ్రాంచైజీ నిర్ణయంపై ఎంత కోపంగా ఉన్నారో అర్థం అవుతోంది. అయితే మ్యాచ్ జరుగుతున్న టైంలో అభిమానుల మధ్య జరిగిన ఘర్షన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీళ్ల ఘర్షణతో స్టాండ్స్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే కొట్టుకుంది రోహిత్, హార్దిక్ ఫ్యాన్స్ అని ప్రచారం జరుగుతోంది. పాండ్యాను ట్రోల్ చేయడాన్ని తట్టుకోలేని అభిమాని.. అతనిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ గొడవపై స్టేడియంలో ఉన్న కొందరు ఫ్యాన్స్ క్లారిటీ ఇచ్చారు. అది రోహిత్, పాండ్యా ఫ్యాన్స్ మధ్య జరిగిన గొడవ కాదని, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవని చెప్పారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.