ICC టీం ఆఫ్ ద ఇయర్ 2023.. కెప్టెన్గా సూర్య కుమార్ యాదవ్
X
ఐసీసీ తాజాగా మెన్స్ టీ20 టీం ఆఫ్ ద ఇయర్ జట్టును ప్రకటించింది. గతేడాది టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్ల వాళ్లను ఈ జట్టులోకి ఎంపికచేసింది. టాప్ ర్యాంకర్ సూర్యకుమార్ యాదవ్ ను జట్టు కెప్టెన్ గా నియమించింది. ఈ జట్టులో టీమిండియా నుంచి యువ సంచలనం యశస్వీ జైశ్వాల్, రవి బిష్ణోయ్, అర్ష్ దీప్ సింగ్ లకు కూడా చోటు లభించింది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లతో జరిగిన టీ20 సిరీస్‌ల్లో టీమిండియాను సూర్య అద్భుతంగా నడిపించాడు.
2023లో 18 మ్యాచులు ఆడిన సూర్య 733 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలున్నాయి. భారత ఓపెనర్ జైశ్వాల్ కూడా రాణించాడు. అతను 15 మ్యాచుల్లో 430 పరుగులు చేశాడు. స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఆసీస్ తో జరిగిన టీ20 సిరీస్ లో అదరగొట్టాడు. లెఫ్టార్మ్ పేస్ బౌలర్ అర్ష్ దీప్ సింగ్ గతేడాది 21 మ్యాచులు ఆడి 21 వికెట్లు పడగొట్టాడు. వీరితో పాటు విదేశీ ఆటగాళ్లకు కూడా ఈ జట్టులో స్థానం దక్కింది.
ICC టీం ఆఫ్ ద ఇయర్ జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, ఫిల్ సాల్ట్, నికోలస్ పూరన్, మార్క్ చాప్‌మన్, సికిందర్ రజా, రామ్‌జని, మార్క్ ఐదెర్, రవి బిష్ణోయ్, రిచర్డ్ ఎన్‌గరవ, అర్ష్‌దీప్ సింగ్
India's white-ball dynamo headlines the ICC Men's T20I Team of the Year for 2023 🔥
— ICC (@ICC) January 22, 2024
Check out who made the final XI 👇https://t.co/QrQKGYbmu9