IND vs SL: లంకను జయించేందుకు.. శ్రేయస్పై వేటు తప్పదా..?
X
ప్రపంచకప్ లో టీమిండియా దూసుకుపోతుంది. ఆడిన ఆరు మ్యాచుల్లో గెలిచి జైత్రయాత్రను కొనసాగిస్తుంది. ఇప్పటికే సెమీస్ కు అర్హత సాధించి సత్తాచాటింది. అదే జోరును కొనసాగించేందుకు సిద్ధం అయింది. ఇవాళ భారత్, శ్రీలంకతో తలపడనుంది. టీమిండియా ఫేవరెట్ స్టేడియం అయిన వాంఖడేలో (ముంబైలో) ఇవాళ్టి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఆరుకు ఆరు మ్యాచ్ లు గెలిచిన టీమిండియా.. ఈ మ్యాచ్లోనూ గెలవాలని అభిమానులు ఆశిస్తున్నారు. అటు శ్రీలంక ఆరు మ్యాచ్లలో రెండే నెగ్గి పీకల్లోతు కష్టాల్లో ఉంది. పైగా వాంఖడే పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుండటంతో పరుగుల వరద పారే అవకాశం ఉంది. టీమిండియా బ్యాటర్లు సూపర్ ఫామ్ లో ఉన్నారు. అదే కొనసాగితే ఈ మ్యాచ్ లో భారీ స్కోర్ రావడం ఖాయం. ఈ క్రమంలో 2011 వరల్డ్ కప్ ఫైనల్ ను అంతా గుర్తుచేసుకుంటున్నారు. ఆ క్షణాలను మళ్లీ రిపీట్ చేయాలని కోరుకుంటున్నారు.
కాగా కెప్టెన్ రోహిత్ శర్మకు ఇది సొంత మైదానం. అయినప్పటికీ కెప్టెన్ అయ్యాక ఈ స్టేడియంలో ఆడుతున్న మొదటి మ్యాచ్ ఇదే కావడం విశేషం. ప్రస్తుతం భీకర ఫామ్ లో ఉండి.. కెప్టెన్ గా జట్టును ముందుకు నడిపిస్తున్న రోహిత్.. సొంత మైదానంలో భారీ స్కోర్ చేయాలని అంతా కోరుకుంటున్నారు. కాగా ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ పై వేటు పడే అవకాశం కనిపిస్తుంది. శ్రేయస్ ఆరు మ్యాచ్ లు ఆడగా.. ప్రతీ మ్యాచ్ లో బ్యాటింగ్ వచ్చింది. అయితే అందిన అవకాశాన్ని సద్వినియోగించుకోవడంలో శ్రేయస్ విఫలం అయ్యాడని క్రికెట్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. ఆరు మ్యాచుల్లో ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఒక మ్యాచ్ లో హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. చెత్త షాట్లు ఆడి వికెట్ పారేసుకుంటున్నాడు. దీంతో శ్రేయస్ ను పక్కబెట్టి ఇషాన్ కిషన్ ను ఆడించాలని కోరుకుంటున్నారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.