టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్
X
బీసీసీఐ చీఫ్ సెలక్టర్గా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ ఎంపికయ్యారు. శివ సుందర్ దాస్, సలీల్ అంకోలా, సుబ్రతో బెనర్జీ, ఎస్ శరత్‌లతో కూడిన సెలక్షన్ ప్యానెల్లో అగార్కర్ చీఫ్ సెలక్టర్గా వ్యవహరించనున్నారు. స్టింగ్ ఆపరేషన్ నేపథ్యంలో చేతన్ శర్మ రిజైన్ చేసిన తర్వాత ఫిబ్రవరి నుంచి చీఫ్ సెలక్టర్ పోస్ట్ ఖాళీగా ఉంది.
45 ఏళ్ల అగార్కర్ 26 టెస్టులు, 191 వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడారు. టెస్టుల్లో 58 వికెట్లు, వన్డేల్లో 288 వికెట్లు తీశారు. ఇక ఐపీఎల్‌లో 42 మ్యాచ్‌లు ఆడిన అతడు 29 వికెట్లు తీశారు. ముంబై సీనియర్ జట్టుకు చీఫ్ సెలెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. అలాగే ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు కోచ్‌గా వ్యవహరించగా.. ఇటీవలే ఆ పదవి గుడ్ బై చెప్పాడు.
వెస్టిండీస్‌తో టెస్టు, వన్డే జట్లను ప్రకటించిన బోర్డు.. ఇంకా టీ20 జట్టును వెల్లడించలేదు. ఈ క్రమంలో అగార్కర్ నేతృత్వంలో టీ20 జట్టు ఎంపిక కానుంది. ఇప్పటికే టీ20 పూర్తి స్థాయి కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను నియమించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. అదే నిజం అన్నట్లు టీ20 వరల్డ్ కప్ తర్వాత నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ను టీ20 జట్టులోకి సెలక్ట్ చేయలేదు. ప్రస్తుతం చీఫ్ సెలక్టర్ గా ఎంపికైన అజిత్ అగార్కర్ టీ20ల్లో సీనియర్ల ఎంపికపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడన్నది ఆసక్తిగా మారింది.