Home > క్రీడలు > Yuvraj Singh : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన యువరాజ్..అందుకేనా?

Yuvraj Singh : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన యువరాజ్..అందుకేనా?

Yuvraj Singh : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన యువరాజ్..అందుకేనా?
X

భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ భారతీయ జనతా పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పంజాబ్ లోని గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉందని సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం గురుదాస్‌పూర్ ప్రాంతం నుంచి బీజేపీకి చెందిన బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇకపోతే ఈ మధ్యనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కూడా యువరాజ్ సింగ్ కలిశారు. దీంతో యువరాజ్ సింగ్ రాజకీయాల్లోకి వస్తారని, బీజేపీలో చేరుతారనే కథనాలు మరికాస్త ఎక్కువయ్యాయి. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పంచుకున్నారు. 2019లో వన్డే ప్రపంచకప్‌కు ముందే యువరాజ్ అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లకు రిటైర్‌మెంట్ ప్రకటించారు. ఆ సందర్భంగా కూడా ఆయన రాజకీయాల్లో చేరాలనే తన కోరికను వ్యక్తం చేయలేదు.

ప్రస్తుతం యువరాజ్ సింగ్ రాబోయే సార్వత్రిక ఎన్నికలలో గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. సన్నీడియోల్ తర్వాత నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని మార్చవచ్చనే ప్రచారం జోరందుకుంది. ఈ సమయంలో యువరాజ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారని అందరూ అనుకుంటున్నారు. మరోవైపు మాజీ క్రికెటర్లు గౌతమ్ గంబీర్ తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ కొనసాగుతున్నారు. ఆ తర్వాత పంజాబ్ నుంచి ఆప్ ఎంపీగా హర్భజన్ సింగ్ కొనసాగుతున్నారు.






Updated : 12 Feb 2024 7:25 AM GMT
Tags:    
Next Story
Share it
Top