Home > క్రీడలు > కోహ్లీ, రోహిత్లను మధ్యలోకి లాగి.. బీసీసీఐ తీరుపై మాజీ క్రికెటర్‌ల ఆగ్రహం..

కోహ్లీ, రోహిత్లను మధ్యలోకి లాగి.. బీసీసీఐ తీరుపై మాజీ క్రికెటర్‌ల ఆగ్రహం..

కోహ్లీ, రోహిత్లను మధ్యలోకి లాగి.. బీసీసీఐ తీరుపై మాజీ క్రికెటర్‌ల ఆగ్రహం..
X

దేశవాళీల్లో ఆడటం లేదని ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ల సెంట్రల్ కాంట్రాక్ట్ ను బీసీసీఐ తప్పించిన విషయం తెలిసిందే. ఈ చర్య క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ ఇద్దరిని రంజీల్లో ఆడమని బీసీసీఐ హెచ్చరించినా వినలేదు. ఫలితంగా బీసీసీఐ వారికి గట్టి సమాధానం చెప్పింది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నావాదనలు వినిపిస్తున్నాయి. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ బీసీసీఐని తప్పుపట్టాడు. ప్రతిభావంతులైన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ కు సెంట్రల్ కాంట్రాక్ట్ లో చోటు దక్కకపోవడం బాధాకరమని అన్నాడు. వారు తిరిగి పుంజుకుని.. కాంట్రాక్ట్ సాధిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ఈ సందర్భంగా ఇర్ఫాన్ మాట్లాడుతూ.. హార్దిక్ పాండ్యా కూడా రెడ్ బాల్ క్రికెట్, రంజీ టోర్నీలో పాల్గొట్లుదు. అయినా కాంట్రాక్ట్ లో చోటు దక్కింది. ప్లేయర్లందరికీ ఒకే రూల్ ఉండాలి. అది వర్తించకపోతే ఆశించిన ఫలితాలను టీమిండియా సాధించలేదని ట్వీట్ చేశాడు.

మరోవైపు 1983లో వన్డే వరల్డ్‌ కప్‌ గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడైన కృతి ఆజాద్‌ బీసీసీఐ తీరుపై మండిపడ్డాడు. అందరికీ ఒకేరకమైన నిబంధనలు ఉండాలని.. శ్రేయస్‌, ఇషాన్‌లను బలిపెట్టడం సరైంది కాదని అభిప్రాయపడ్డాడు. ‘అందరూ దేశవాళీల్లో ఆడాలని బీసీసీఐ తీసుకుంది మంచి నిర్ణయమే. అలా అంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా రంజీల్లో ఆడాలి. వాళ్ల రాష్ట్ర తరుపున ప్రాతినిథ్యం వహించాల’ని ఆజాద్ సూచించాడు. కాగా దీనిపై బీసీసీఐ ఎలాంటి చర్య తీసుకుంటుందో చూడాలి. క్షమించి వాళ్లకు తిరిగి కాంట్రాక్ట్ అప్పగిస్తుందా చూడాలి.

Updated : 29 Feb 2024 1:04 PM GMT
Tags:    
Next Story
Share it
Top