IND vs SL: భారత బౌలర్లకు అంత సీన్ లేదు.. ఐసీసీతో కుమ్మక్కై
X
సొంత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ లో టీమిండియా జైత్రయాత్ర చేస్తుంది. ఆడిన 7 మ్యాచ్ లూ గెలిచి సెమీస్ కు క్వాలిఫై అయింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో సత్తా చాటుతూ.. సింహాల్లా దూసుకెళ్తున్నారు. ఇక మన పేస్ దళం విషయానికి వస్తే.. బుమ్రా, షమీ, సిరాజ్ ప్రత్యర్థుల్ని ముప్పు తిప్పలు పెడుతున్నారు. స్వింగ్ తో బెంబేలెత్తిస్తున్నారు. నిన్న శ్రీలంకను 55 పరుగులకే ఆలౌట్ చేసి భారీ విజయాన్ని నమోదు చేశారు. సిరాజ్ 3, షమీ 5 వికెట్లు తీసుకుని లంకను జయించారు. ఈ భారీ విజయాన్ని భారత అభిమానులతో పాటు.. మాజీలు, విమర్శకులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. కాగా పాకిస్తాన్ మాత్రం టీమిండియాపై విషం కక్కడాన్ని ఆపడంలేదు. బీసీసీ, ఐసీసీతో కుమ్మక్కైందని, అందుకు భారత్ అంత సులువుగా విజయాలు నమోదు చేస్తుందని ఆరోపిస్తున్నారు.
తాజాగా టీమిండియా వరుస విజయాలు సాధిస్తుండటంపై పాక్ మాజీ క్రికెటర్ హసన్ రజా సంచలన ఆరోపణలు చేశాడు. ‘వరల్డ్ కప్ లో భారత పేస్ బౌలర్ల అందరికీ చుక్కలు చూపిస్తున్నారు. ఏ జట్టు బౌలర్లకు లభించనంత స్వింగ్ ఆ బౌలర్లకు లభిస్తుంది. మిగతా టీంల బౌలర్ల కన్నా టీమిండియా బౌలర్లకే చాలా స్వింగ్ లభిస్తోంది. ఇందులో కచ్చితంగా ఏదో కుట్రో కోణం ఉంది. బీసీసీఐ, ఐసీసీతో కుమ్మక్కైంది. భారత బౌలర్లకు ప్రత్యేక బంతులు ఇస్తున్నట్లు అనిపిస్తుంది. అందుకే వాళ్లు బ్యాటింగ్ పిచ్ పైన కూడా వికెట్లు తీయగలుగుతున్నారు. ఏ డీఆర్ఎస్ అయినా వారికి అనుకూలంగా వస్తుంది. దీనిపై విచారణ జరగాల్సిందే’ అని హసన్ రజా ఓ ఇంటర్వ్యూలో ఆరోపించాడు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.