Home > క్రీడలు > పాక్‌ బౌలర్‌ సంచలన స్పెల్...

పాక్‌ బౌలర్‌ సంచలన స్పెల్...

పాక్‌ బౌలర్‌ సంచలన స్పెల్...
X

జింబాబ్వే ఆఫ్రో టీ10 లీగ్‌లో సంచలన నమోదైంది. పాక్ మాజీ ఆల్ రౌండర్ హఫీజ్ తన బౌలింగ్‎తో విజృంభించాడు. జోబర్గ్‌ బఫెలోస్‌ తరఫున ఆడుతున్న హఫీజ్ శుక్రవారం బులవాయో బ్రేవ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంచలన గణంకాలు నమోదు చేశాడు. కేవలం 2 ఓవర్లు వేసి 4 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. మొత్తం 12 బంతుల్లో 11 డాట్ బాల్స్ ఉన్నాయి. ఇచ్చిన 4 పరుగులు కూడా ఒకే ఓవర్‌లో వచ్చాయి. మరో ఓవర్‌లో 3 వికెట్లు తీసి ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. గుర్తింపు పొందిన టీ10 క్రికెట్‌లో హాఫీజ్‌వే అత్యుత్తమ గణాంకాలు. టీ10 క్రికెట్‌లో 6 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా హఫీజ్ చరిత్ర సృష్టించారు. అతనికంటే ముందు టీ10 క్రికెట్‌లో వనిందు హసరంగా, ప్రవీణ్ తాంబే, మర్చంట్ డిలాంగే 5 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టారు.

మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్‌ చేసిన జోబర్గ్‌ బఫెలోస్‌ నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ముష్ఫికర్‌ రహీం (23 బంతుల్లో 46 నాటౌట్‌; 8 ఫోర్లు) చెలరేగగా..

ఓపెనర్‌ టామ్‌ బాంటన్‌ (18 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. బ్రేవ్స్‌ బౌలర్లలో తస్కిన్‌ అహ్మద్‌ 3, ఫరాజ్‌, వెబ్‌స్టర్‌, సికందర్‌ రజాలు ఒక్కో వికెట్ తీశారు.

106 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బులవాయో బ్రేవ్స్‌ కేవలం కి 10 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 95 పరుగులు మాత్రమే చేసింది. మహ్మద్‌ హఫీజ్‌ (2-1-4-6) ఆ టీమ్ పతనాన్ని శాసించాడు. హఫీజ్‌తో పాటు మసకద్జ మూడు వికెట్లు తీయడంతో బ్రేవ్స్‌ బ్యాటర్లు క్రీజ్‌లో నిలువలేకపోయారు. బ్రేవ్స్‌ ఇన్నింగ్స్‌లో వెబ్‌స్టర్‌ (22 బంతుల్లో 39 నాటౌట్‌) టాప్ స్కోరర్. బ్రేవ్స్‌ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. వారిలో ముగ్గురు గోల్డన్‌ డకౌట్లు కావడం విశేషం.

Updated : 22 July 2023 9:51 AM GMT
Tags:    
Next Story
Share it
Top