Home > క్రీడలు > పాక్ మాజీ క్రికెటర్‌కు 12 ఏళ్ల జైలు శిక్ష

పాక్ మాజీ క్రికెటర్‌కు 12 ఏళ్ల జైలు శిక్ష

పాక్ మాజీ క్రికెటర్‌కు 12 ఏళ్ల జైలు శిక్ష
X

పాకిస్తాన్ మాజీ క్రికెటటర్ ఖాలిద్ లతీఫ్‌కు జైలుశిక్ష పడింది. నెదర్లాండ్స్‌కు చెందిన రాజకీయ నాయకుడు గీర్ట్‌ విల్‌డర్స్‌ను హత్య చేయాలని ముస్లింలను రెచ్చగొట్టిన కేసులో ఆమ్‌స్టర్‌డామ్ కోర్టు 12 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఇస్లాం మతాన్ని వ్యతిరేకించే విల్‌డర్స్‌ను హత్య చేస్తే 23 వేల డాలర్లు(రూ. 19 లక్షలు) బహుమతిగా ఇస్తానని లతీఫ్ 2018లో ప్రకటించాడు. దీనిపై డచ్ కోర్టులో కేసు నమోదైంది. మహమ్మద్ ప్రవక్తపై బొమ్మ గీయించడానికి కార్టూనిస్టులకు పోటీ పెడతాని విల్‌డర్స్ చెప్పండంతో లతీఫ్ అతి తలకు వెల కట్టాడు. దీంతో డచ్ కోర్టు తరఫున ఇంటర్నేషనల్ వారంట్ జారీ అయింది. లతీఫ్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డంతో 2017లో అన్ని క్రికెట్ ఫార్మాట్ల నుంచి పాక్ జట్లు బహిష్కరించాయి. అతడు పాక్ తరపున ఐదు వన్డేలు, 13 టీ20లు ఆడాడు.

Updated : 12 Sept 2023 7:45 AM IST
Tags:    
Next Story
Share it
Top