పుజారా ఆటతీరుపై పాక్ మాజీ ఆటగాడు తీవ్ర విమర్శలు
X
WTC ఫైనల్ మ్యాచ్ ఫలితం భారత్ అభిమానుల్ని తీవ్ర నిరాశపర్చింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత్ ఆటగాళ్లు ఆస్ట్రేలియా ముందు చేతులెత్తేశారు. దీంతో వరుసగా రెండో సారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టైటిల్ భారత్ చేజార్చుకుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న టీమిండియా సీనియర్ ఆటగాళ్లు తుస్సు మనిపించారు. రోహిత్, కోహ్లీలు తమ స్థాయికి దగ్గ ప్రదర్శన చేయలేదు.
ఇంగ్లాండ్ కౌంటీల్లో సత్తా చాటిన పుజారా సైతం పేలవ ప్రదర్శన కనిపించాడు. ఏప్రిల్ నుంచి మే మధ్యకాలంలో ఇంగ్లాండ్‌లోనే ఆరు కౌంటీ మ్యాచ్‌లను ఆడిన పుజారా.. మూడు సెంచరీల సాయంతో 545 పరుగులు సాధించాడు. అదే ఫామ్‌ను WTC ఫైనల్‌లో కొనసాగిస్తాడని అంతా భావించారు. కానీ పుజారా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో పుజారా ఆటతీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా సైతం పుజారాను బ్యాటింగ్‌పై విమర్శలు గుప్పించాడు. రెండు నెలల పాటు కౌంటీ క్రికెట్ ఆడి..అక్కడి పరిస్థితులు అలవాటు చేసుకున్న పుజరా ఫైనల్ల్లో చేతులెత్తేసాడని తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా వివరించాడు. అతడి అనుభవం మొత్తం డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఉపయోగించాల్సింది పోయి విఫలం కావడాన్ని తప్పుబట్టాడు. ఆసీస్ బౌలర్లలను పుజరా ఎదుర్కోలేకపోయాడంటూ కనేరియా విమర్శించాడు.