నేను ఎంట్రీ ఇస్తే కథ వేరే ఉంటది: అజారుద్దీన్
X
దేశంలో అత్యంత అసమర్థ, అవినీతి క్రికెట్ బోర్డుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)కు పేరుంది. తరచూ ఏదో ఒక వివాదంల్లో ఇరుక్కుని వార్తల్లో నిలుస్తుంటుంది. ఈ విషయంలో కలుగజేసుకున్న సుప్రీం కోర్టు.. ఈ ఏడాది మొదట్లో రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ ఎల్. నాగేశ్వర రావును హెచ్సీఏ అడ్మినిస్ట్రేటర్గా నియమించింది. ఆ తర్వాత అసోసియేషన్ నిబంధనలకు విరుద్ధంగా కలిగిన 57 క్రికెట్ క్లబ్ లపై వేటువేశారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు టీమిండియా మాజీ కెప్టెన్, హెచ్సీఏ మాజీ అధ్యక్షడు మహమ్మద్ అజరుద్ధీన్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన హెచ్సీఏపై కీలక వ్యాఖ్యలు చేశారు.
రాబోయే హెచ్సీఏ అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తానని.. అధ్యక్షుడిగా ఎన్నికైన మరుక్షణం హెచ్సీఏలోని అవినీతిని అంతం చేస్తానని తెలిపారు. ‘సెప్టెంబర్ 15న జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తా. క్లబ్స్పై నిషేధం విధించడం నాకు సంతోషంగా అనిపించింది. గత 14 ఏళ్లుగా హెచ్సీఏ అవనీతితో నిండిపోయింది. దాన్ని అంతం చేసి అసోసియేషన్ను మెరుగు పరచడంపై దృష్టి పెడతా. నేను ఏ క్లబ్కు ఓనర్ను కాదు. ఓ మాజీ అంతర్జాతీయ ప్లేయర్గా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతి ఉంద’ని ఆజరుద్ధీన్ అన్నారు. హెచ్సీఏను ఆర్థికంగా నిలదొక్కుకుంనేలా చేయడంతో పాటు.. బీసీసీఐపై ఆధారపడకుండా చేయడమే ఆయన లక్ష్యం అని అన్నారు.