Home > క్రీడలు > IPL Auction 2024: ఫ్రాంచైజీల మధ్య వార్.. అనామక ప్లేయర్కు 10 కోట్లు

IPL Auction 2024: ఫ్రాంచైజీల మధ్య వార్.. అనామక ప్లేయర్కు 10 కోట్లు

IPL Auction 2024: ఫ్రాంచైజీల మధ్య వార్.. అనామక ప్లేయర్కు 10 కోట్లు
X

ఐపీఎల్ 2024 మినీ వేలం సంచలనాలకు కేరాఫ్ గా మారింది. ఆసీస్ ప్లేయర్లు పాట్ కమ్మిన్స్ (20 కోట్లు), మిచెల్ స్టార్క్ (24 కోట్లు) రికార్డ్ ధర పలకగా.. అన్ క్యాప్డ్ ప్లేయర్స్ కూడా భారీ ధరకు అమ్ముడవుతున్నారు. ఈ క్రమంలో అనామక ప్లేయర్ స్పెన్సర్ జాన్సన్ కు జాక్ పాట్ తగిలింది. ఈ ఆస్ట్రేలియా బౌలర్ ను గుజరాత్ టైటాన్స్ రూ.10 కోట్లకు సొంతం చేసుకుంది. జాన్సన్ కోసం ఢిల్లీ, గుజరాత్ ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మరో ఆసీస్ ఆటగాడు జాయ్ రిజర్డ్ సన్ ను గుజరాత్ రూ.5 కోట్లకు కొనుగోలు చేసింది. శ్రీలంక ఆటగాడు నువాన్ తుషారా కూడా భారీ ధర పలికాడు. రూ.4.80 కోట్లకు ముంబై సొంతం చేసుకుంది. రాబిన్ మిన్జ్ ను రూ.3.6 కోట్లకు గుజరాత్ కొనుగోలు చేసింది.

ఇంగ్లాండ్‌ ఆటగాడు డేవిడ్ విల్లే రూ. 2 కోట్లకు లక్నో, అస్టన్ అగర్ ను రూ.కోటికి లక్నో, రూ.1.5 కోట్లకు రుథర్ ఫోర్డ్ ను కోల్ కతా, రూ.1.5 కోట్లకు టామ్ కర్ ను బెంగళూరు, రూ.20 లక్షలకు ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్ లను పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఇక సందీప్‌ వారియర్, లూక్ వుడ్, శశాంక్‌ సింగ్‌, స్వస్తిక్‌ ఛిక్కా, రితిక్ ఈశ్వరన్, హిమ్మత్‌ సింగ్‌, సుమిత్‌ వర్మ, ముస్తాఫిజర్‌ రహ్మాన్‌,మ్యాట్ హెన్రీ, కేల్‌ జేమీసన్, బెన్ డ్వారిషుస్‌, షై హోప్‌, దుష్మంత చమీరా, జేమ్స్‌ నీషమ్‌, కీమో పాల్‌, వాండర్ డసెన్, ఓడియన్‌ స్మిత్ అన్‌సోల్డ్‌ గా మిగిలిపోయారు.

Updated : 19 Dec 2023 8:20 PM IST
Tags:    
Next Story
Share it
Top