Home > క్రీడలు > IPL 2024 : ధోనీ రిటైర్‌మెంట్.. పంత్ రీఎంట్రీ.. ఈ ఐపీఎల్‌‌లో ఫ్యాన్స్‌కు మస్తు మజా

IPL 2024 : ధోనీ రిటైర్‌మెంట్.. పంత్ రీఎంట్రీ.. ఈ ఐపీఎల్‌‌లో ఫ్యాన్స్‌కు మస్తు మజా

IPL 2024 : ధోనీ రిటైర్‌మెంట్.. పంత్ రీఎంట్రీ.. ఈ ఐపీఎల్‌‌లో ఫ్యాన్స్‌కు మస్తు మజా
X

2024 క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పాలి. ఈ ఏడాది అండర్-19 ప్రపంచకప్, పురుషుల టీ20 ప్రపంచకప్, మహిళల టీ20 ప్రపంచకప్ వంటి వరస ఈవెంట్స్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించనున్నాయి. అంతే కాకుండా ప్రతి సంవత్సరం జరిగే ఐపీఎల్ కూడా అదనపు ఆకర్షణ. పురుషుల టీ20 ప్రపంచకప్‌కు ముందు ఐపీఎల్ 17వ సీజన్ జరగనుంది. అభిమానులకు బ్లాక్‌ బస్టర్ వినోదాన్ని అందించడానికి ఐపీఎల్ అన్ని హంగులతో సిద్దమవుతుంది. ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలం ఎంతటి ఉత్కంఠతో సాగిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ ఐపీఎల్ సీజన్‌లో సంచలనాత్మక ప్రదర్శనలతో పాటుగా అనేక భావోద్వేగ క్షణాలకు వేదిక కానుంది.

ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?

ఈ ఐపీఎల్‌లో అందరి దృష్టి మహేంద్ర సింగ్ ధోనీపై ఉంది. ఈ 42 ఏళ్ల వెటరన్ ప్లేయర్ ఐదుసార్లు జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. 2019 నుండి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న ధోనీ.. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ప్రతి ఐపీఎల్‌‌లోనూ సెంటర్ ఆప్ ఆట్రాక్షన్ ధోనీయే. ధోనీ ఎక్కడ ఆడిన అభిమానుల సపోర్ట్‌ మాములుగా ఉండదు. ప్రత్యర్థి జట్టు అభిమానులు కూడా ధోనీ జెర్సీ ధరించి మైదానానికి వచ్చేవారు. అలాంటి ఆటగాడికి ఇది చివరి ఐపీఎల్ అంటే ఫ్యాన్స్‌లో ఎంతటి భావోద్వేగం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే రిటైర్‌మెంట్ తర్వాత కూడా చెన్నై సూపర్ కింగ్స్‌కు ధోనీ పరోక్ష సేవలు అందిస్తారని టాక్.

రిషబ్ పంత్ పురోగమనం

ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ చాలా కాలం తర్వాత ఐపీఎల్ ఆడనున్నాడు. 2022 లో కారు ప్రమాదంలో రిషబ్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఈ ప్రమాద గాయాల నుండి కొలుకున్న రిషబ్ అప్పటి నుంచి ఫిట్‌నెస్‌ కోసం నిరంతరం శ్రమిస్తున్నాడు. గత ఐపీఎల్‌లో పంత్ గైర్హాజరీతో డేవిడ్ వార్నర్ జట్టుకు సారథ్యం వహించాడు. ఈసారి పంత్ ఢిల్లీ జట్లుకు నాయకత్వం వహించవచ్చు. పంత్ 2016లో IPL అరంగేట్రం చేసినప్పటి నుండి ఢిల్లీ క్యాపిటల్‌తో విడదీయరాని అనుబంధం ఉంది . ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ 98 మ్యాచ్‌ల్లో 147.97 స్ట్రైక్ రేట్‌తో 2838 పరుగులు చేశాడు.

రోహిత్‌ స్థానంలో ముంబై కెప్టెన్‌గా హార్దిక్

ఈ సారి ముంబై కెప్టెన్‌గా హార్థిక్ పాండ్యా వ్యవహరించనున్నారు. రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు హార్దిక్ పాండ్యకు అప్పగించారు. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. రోహిత్ ఐదుసార్లు ముంబైని ఛాంపియన్‌గా నిలిపాడు. అతని స్థానంలో హార్దిక్ పాండ్యా జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు. ముంబై యాజమాన్యం ఇటీవలే గుజరాత్ టైటాన్స్ నుండి హార్దిక్‌ను జట్టులో చేర్చుకుంది. అంతకుముందు ముంబై జట్టులో హార్దిక్‌ కీలక ఆటగాడిగా ఉన్నాడు. 2022 సీజన్‌లో గుజరాత్ తన జట్టుకు కెప్టెన్‌గా నియమించుకుంది. తాజాగా హోమ్‌ కమింగ్ చేసిన హార్థిక్.. రోహిత్ శర్మ వారసత్వాన్ని ఎలా ముందుకు తీసుకెళుతాడో చూడాలి.

కోల్‌కతా మెంటార్‌గా గౌతమ్ గంభీర్

గౌతమ్ గంభీర్ IPL 2024 కోసం కోల్‌కతా నైట్ రైడర్స్‌కు టీమ్ మెంటార్‌గా హోమ్‌ కమింగ్ చేసాడు. తన కెప్టెన్సీలో రెండుసార్లు కోల్‌కతాను ఛాంపియన్‌గా నిలిపాడు. లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా ఆ జట్టుకు విస్తృత సేవలు అందించిన గంభీర్ అతని హయాంలో లక్నో జట్టు రెండుసార్లు ప్లే ఆఫ్‌కు చేరుకుంది. ఇక గత సీజన్‌లలో 7 స్థానంలో నిలిచిన కోల్‌కతా జట్టును గంభీర్ ఎలా తీర్చిదిద్దుతాడో చూడాలి.

Updated : 1 Jan 2024 5:58 PM IST
Tags:    
Next Story
Share it
Top