Home > క్రీడలు > క్రికెటర్ అయినందుకు బాధపడుతున్నా: గంభీర్

క్రికెటర్ అయినందుకు బాధపడుతున్నా: గంభీర్

క్రికెటర్ అయినందుకు బాధపడుతున్నా: గంభీర్
X

ధోనీ సారథ్యంలో 2007, 2011లో టీమిండియా రెండుసార్లు ప్రపంచకప్ విజేతగా నిలిచింది. ఈ రెండుసార్లు టీం కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్. ఒత్తిడి నుంచి బయటికి వచ్చి ఫైనల్ లో విరోచితంగా పోరాడి విజయాన్ని అందించాడు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే గంభీర్.. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా ది బడా భారత్ టాక్ షో సీజన్ 2లో ర్యాపిడ్ ఫైర్ సెగ్మెంట్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన గంభీర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు గురించి వివరించాడు.

ఇంటర్వ్యూవర్ ‘మీరు జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఏంట’ని ప్రశ్నించగా.. ‘క్రికెటర్ అయినందుకు చింతిస్తున్నా. పశ్చాత్తాపానికి లోనయ్యా. నేను చేసిన అతిపెద్ద తప్పు కూడా అదే’అని జవాబిచ్చాడు. క్రికెట్ లో ఎన్నో ఘనతలు సాధించిన వ్యక్తి ఈ సమాధానం చెప్పడంతో అక్కడున్నవాళ్లంతా షాక్ కు గురయ్యారు. 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో 75, 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో 97 పరుగులు చేశాడు గంభీర్. టెస్టుల్లో వరుసగా 5 సెంచరీలు చేశాడు. నెంబర్ స్థానానికి చేరుకున్నాడు. భారత కెప్టెన్ గా ఆరు మ్యాచుల్లో విజయం సాధించాడు. ఐపీఎల్ లో కోల్కత్తా నైట్రైడర్స్ టీంను రెండుసార్లు విజేతగా నిలిపాడు. అయితే, వరల్డ్ కప్ హీరోగా తనను గుర్తించకుండా ప్రతీ ఒక్కరు ధోనీని పొగడటంపై గంభీర్ చాలాసార్లు అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంతేకాకుండా విరాట్ కోహ్లీతో ఇప్పటికీ వివాదాలు కొనసాగుతున్నాయి.




Updated : 7 Sep 2023 8:19 AM GMT
Tags:    
Next Story
Share it
Top