Home > క్రీడలు > కోహ్లీనే రాజీనామా చేశాడు.. మేమేం తప్పించలేదు

కోహ్లీనే రాజీనామా చేశాడు.. మేమేం తప్పించలేదు

కోహ్లీనే రాజీనామా చేశాడు.. మేమేం తప్పించలేదు
X

మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత జట్టు పగ్గాలు చేపట్టిన విరాట్ కోహ్లీ.. టీమిండియాను అందనంత ఎత్తుకు తీసుకెళ్లాడు. ఏ కెప్టెన్ కు సాధ్యం కాని రికార్డులను సాధించి చూపించాడు. 2016 నుంచి భారత్ ను అన్ని ఫార్మట్లలో నెంబర్ వన్ గా నిలబెట్టాడు. భారత అత్యుత్తమ కెప్టెన్ గా నిలిచాడు. అతని వ్యూహాలన్నీ ఒకెత్తైతే.. కోహ్లీ అగ్రెషన్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కాగా 2021లో టీ20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత బీసీసీఐ వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించగా.. 2021-22 సౌతాఫ్రికా పర్యటన అనంతరం కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. దాంతో రోహిత్ శర్మ మూడు ఫార్మట్లకు కెప్టెన్ అయ్యాడు. అప్పట్లో బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ విరాట్ కోహ్లీని కావాలనే తప్పించారనే ప్రచారం జరిగింది. దీనిపై క్లారిటీ ఇచ్చిన గంగూలీ.. కోహ్లీ రాజీనామా చేయడంలో తన ప్రమేయం ఏమీ లేదని మరోసారి చెప్పుకొచ్చాడు. కోహ్లీని టెస్ట్ కెప్టెన్సీ నుంచి తొలగించలేదని.. టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగాక వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని తాను కోరినట్లు గంగూలీ చెప్పాడు.

దాదాగిరి అన్ లిమిటెడ్ సీజన్ 10లో పాల్గొన్న గంగూలీ.. కోహ్లీ కెప్టెన్సీ రాజీనామాపై క్లారిటీ ఇచ్చాడు. ‘నేనేం కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించలేదు. ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాను. కోహ్లీకి టీ20 కెప్టెన్సీ చేయడం ఇష్టం లేదు. అందుకే రాజీనామా చేశాడు. తర్వాత అతన్ని కలిసి.. టీ20 కెప్టెన్సీ చేయకపోతే మొత్తం వైట్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకోవాలని కోరా. ఆ తర్వాత టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా తనంతట తానే తప్పుకున్నాడు’అని దాదా చెప్పాడు. 2014లో ధోనీ రిటైర్మెంట్ తర్వాత టీమిండియా కెప్టెన్ గా ఎంపికైన కోహ్లీ.. 7 ఏళ్లలో 68 టెస్టుల్లో సారథ్యం వహించి 40 విజయాలు అందించాడు. భారత్ కు ఎక్కువ టెస్ట్ విజయాలు అందించిన కెప్టెన్ గా కోహ్లీ నిలిచాడు.

Updated : 5 Dec 2023 10:00 AM GMT
Tags:    
Next Story
Share it
Top