Rishabh Pant: పంత్ రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సౌరవ్ గంగూలీ
X
టీమిండియా క్రికెట్ లో అతి తక్కువ కాలంలో తనదైన ముద్రవేసి బ్యాటర్ గా, కీపర్ గా అందరి ప్రశంసలు అందుకున్నాడు రిషబ్ పంత్. షార్ట్ టైంలోనే టీమిండియా రెగ్యులర్ ప్లేయర్ గా మారాడు. ముఖ్యంగా పంత్ అటాకింగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఎక్కువ. కెరీర్ ఎదుగుతుంది అనుకున్న టైంలో.. గతేడాది డిసెంబర్ లో కార్ యాక్సిడెంట్ కు గురై.. ఆటకు దూరం అయ్యాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటూ.. నెట్స్ లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. బెంగళూరులోని ఎన్సీఏలో శిక్షణ తీసుకుంటున్నాడు. కాగా అతని రీఎంట్రీపై అందరిలో ఆసక్తి నెలకొంది.
పంత్ ఎప్పుడెప్పుడు గ్రౌండ్ లో అడుగుపెడతాడా అని ఆశగా చూస్తున్నారు. వచ్చే ఐపీఎల్ లో పంత్ ఆడతాడా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. తాజాగా దీనిపై ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2024లో పంత్ ఆడతాడని కన్ఫార్మ్ చేశాడు. ‘పంత్ గాయాల నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు. వచ్చే ఐపీఎల్ లో కచ్చితంగా రీఎంట్రీ ఇస్తాడు. డిసెంబర్ 19న దుబాయ్ లో ఐపీఎల్ వేలం జరగనుంది. ఆ వేలానికి ముందు జట్టు నిర్మాణంపై పూర్తి ఫోకస్ పెట్టాం’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు.
Ganguly confirms Rishabh Pant will get better by January. [Sportstar]
— Johns. (@CricCrazyJohns) November 10, 2023
- Good news for India. pic.twitter.com/mCyeNHPWHT