దిగొచ్చిన గంభీర్.. ఇంగ్లాండ్ కోచ్కు క్షమాపణలు
X
టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఎప్పుడూ ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తుంటాడు. ఎంతటి వ్యక్తి అయినా.. ముక్కుసూటిగా తన మనసులోని అభిప్రాయాన్ని చెప్పేస్తాడు. వీటిలో నిజాలు ఉన్నా.. కొన్నికొన్ని సార్లు వివాదాస్పదం అవుతుంటాయి. అలాంటి గంభీర్.. తన కావాలని తప్పు చేయకపోయినా, దిగొచ్చి మరీ సారీ చెప్పాడు. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కాగా తాజాగా గంభీర్.. న్యూజిలాండ్ మాజీ ఓపెనర్, ప్రస్తుత ఇంగ్లాండ్ హెడ్ కోచ్ మెకల్లమ్ కు క్షమాపణలు చేప్పాడు. ఐపీఎల్ విజేతగా నిలిచిన జట్లలో కోల్ కతా నైట్ రైడర్స్ కూడా ఒకటి. 2012 ఫైనల్స్ లో చైన్నై సూపర్ కింగ్స్ ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ లో మన్విందర్ బిస్లా 89 పరుగులు చేసి హీరోగా నిలిచాడు. ఆ సీజన్ లో గంభీర్ కు జోడీగా.. మెకల్లమ్ ను ఓపెనర్ గా పంపించారు. కానీ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం అతన్ని పక్కనబెట్టారు. దీనిపై స్పందించిన గంభీర్.. అసలు విషయం చెప్పాడు.నేను చేసింది తప్పే.. దిగొచ్చి సారీ చెప్పిన గౌతమ్ గంభీర్
‘ఫైనల్ మ్యాచ్ ను వెళ్లే ముందు.. టీం ముందు మెకల్లమ్ కు నేను క్షమాపణలు చెప్పాను. తనను ప్లేయింగ్ 11 నుంచి తప్పిస్తున్నట్లు చెప్పాను. బౌలర్ లక్ష్మీపతి బాలాజీ గాయపడటంతో.. జట్టు కూర్పులో మార్పు చేయాల్సి వచ్చింది. దీంతో మెకల్లమ్ స్థానంలో విదేశీ బౌలర్ ను జట్టులోకి తీసుకోవాల్సి వచ్చింది. ఓ భారత ప్లేయర్ ను పక్కనబెట్టి బిస్లాను జట్టులోకి తీసుకున్నాం. టోర్నీ మొత్తం ఆడి.. ఫైనల్ మ్యాచ్ లో బెంచ్ పై కూర్చోవడం ఏ ప్లేయర్ కైనా బాధ కలిగించే విషయమే. అందుకే టీం ముందు మెకల్లమ్ కు సారీ చెప్పా. మనం తప్పు చేయనప్పుడు ధైర్యంగా సారీ చెప్పడంలో తప్పులేద’ని గంభీర్ చెప్పుకొచ్చాడు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.