Home > క్రీడలు > రోహిత్ శర్మ నన్ను నిరాశపర్చాడు-సునీల్ గవాస్కర్

రోహిత్ శర్మ నన్ను నిరాశపర్చాడు-సునీల్ గవాస్కర్

రోహిత్ శర్మ నన్ను నిరాశపర్చాడు-సునీల్ గవాస్కర్
X

రోహిత్ కెప్టెన్సీ నన్ను చాలా నిరుత్సాహపరిచింది అంటున్నారు టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్. టీమ్ లో ఉన్నవాళ్ళ మధ్య ప్రేమ, అభిమానం లేకపోవడం చాలా బాధాకరం అని....జట్టు విజయాలు సాధించకపోవడానికి ఇది కూడా ఒక కారణమని గవాస్కర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఒకప్పుడు జట్టులో ఆటగాళ్ళంతా స్నేహితుల్లా ఉండేవాళ్ళం, ఇప్పుడు కొలీగ్స్ లా ఉంటున్నాం అన్న రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యల మీద గవాస్కర్ స్పందించారు. ఇది చాలా విచారకరమైన విషయం అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేవారు. మ్యాచ్ అయ్యాక అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకోవాలని చెప్పారు. క్రికెట్ గురించే కాకుండా ఇతర విషయాల గురించి కూడా చర్చించుకోవాలని అన్నారు. ఇప్పుడు ప్రతీ ఆటగాడికి ఒక గదిని కేటాయిస్తున్నారు. ఇది ప్లేయర్స్ మధ్య దూరం పెంచుతోందని, భారత జట్టు వైఫల్యాలకు ఇది కూడా ఒక కారణం కావచ్చని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.

అలాగే రోహిత శర్మ కెప్టెన్సీ మీద కూడా తాను అసంతృప్తిగా ఉన్నానని సునీల్ గవాస్కర్ అన్నారు. కెప్టెన్ గా అతని నుంచి ఇంకా ప్రదర్శనను ఆశించానని తెలిపారు. భారత్ లో గెలుస్తున్న విదేశాల్లో ఓడిపోవడం పట్ల ఆయన నిరాశను వ్యక్తం చేశారు. విదేశాల్లో గెలిచినప్పుడే మన సత్తా ఏమిటో తెలుస్తుందని పవాస్కర్ అన్నారు. స్టార్ ఆటగాళ్ళున్నా టీ20 వరల్డ్ కప్ లో భారత్ ఫైనల్స్ కువ వెళ్ళకపోవడం బాధ కలిగించిందని చెప్పుకొచ్చారు. రీసెంట గా డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఆసట్రేలియా చేతిలో కూడా ఇండియా ఓడిపోయింది. రోహిత్ శ్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ మరింత ఎఫర్ట్స్ పెట్టాలని ఆయన కోరారు.

Updated : 10 July 2023 7:13 AM GMT
Tags:    
Next Story
Share it
Top