Home > క్రీడలు > చారిత్రాత్మక టెస్ట్‌కు వెస్టిండీస్ - భారత్ సిద్ధం..!

చారిత్రాత్మక టెస్ట్‌కు వెస్టిండీస్ - భారత్ సిద్ధం..!

చారిత్రాత్మక టెస్ట్‌కు వెస్టిండీస్ - భారత్ సిద్ధం..!
X

భారత్, వెస్టిండీస్ జట్లు రెండో టెస్ట్‌కు సిద్ధమయ్యాయి. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా భారత కాలమానం ప్రకారం గురువారం (జులై 20) సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు టెస్ట్‌ల సిరీస్‎లో మొదటి టెస్ట్‎లో విజయం సాధించిన టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు వెస్టిండీస్‌కు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. సిరీస్‌ను డ్రాతో ముగించాలంటే వెస్టిండీస్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి.

రెండో టెస్ట్‌లో భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో స్వల్ప మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో యంగ్ ప్లేయర్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. తుది జట్టులో పేస్ బౌలర్ ముకేష్ కుమార్ ఎంట్రీ ఇస్తాడని వార్తలు వస్తున్నాయి. శార్దూల్ ఠాకూర్ స్థానంలో ముకేష్‎ను ఆడించనున్నట్లు తెలుస్తోంది. వికెట్ కీపర్‎గా ఇషాన్ కిషన్‎నే కొనసాగించే అవకాశం ఉంది. మిగతా జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. జయదేవ్ ఉనద్కత్, సిరాజ్ జట్టులో కొనసాగుతారు.

100వ టెస్ట్..

ఈ మ్యాచ్ భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే 100వ టెస్ట్. ఇప్పటి వరకు ఆడిన 99 మ్యాచ్‌ల్లో వెస్టిండీస్ 30, భారత్ 23 గెలుపొందగా, 46 డ్రా అయ్యాయి. మరోవైపుకి భారత్ కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ తన 500వ ఆంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. దీని ద్వారా కెరీర్‌లో 500 మ్యాచ్‌లు ఆడిన 10వ ఆటగాడిగా కోహ్లీ నిలవనున్నాడు.

టీమిండియా తుది జట్టు అంచనా: రోహిత్ శర్మ(కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అశ్విన్, శార్దూల్ ఠాకూర్/ముకేశ్ కుమార్, జైదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్





Updated : 20 July 2023 12:26 PM GMT
Tags:    
Next Story
Share it
Top