Home > క్రీడలు > India vs Australia: కీలక సమయంలో రాణిస్తున్న శ్రేయస్.. భారీ స్కోర్ దిశగా భారత్

India vs Australia: కీలక సమయంలో రాణిస్తున్న శ్రేయస్.. భారీ స్కోర్ దిశగా భారత్

India vs Australia: కీలక సమయంలో రాణిస్తున్న శ్రేయస్.. భారీ స్కోర్ దిశగా భారత్
X

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే జరుగుతోంది. ఇండోర్లో జరుగుతున్న ఈ మ్యాచ్కు 10దో ఓవర్లో వర్షం ఆటంకం కలిగించింది. భారత్ టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది. వర్షం కారణంగా అంపైర్లు మ్యాచ్ను నిలిపేశారు. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి సిరీస్ రేస్ లో ఉందామనుకున్న ఆసీస్.. మొదట దూకుడుగా బౌలింగ్ చేసింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ లో గైక్వాడ్ (8) ఔట్ అయ్యాడు. కొంతసేపటికి వర్షం తగ్గడంతో అంపైర్లు మ్యాచ్ ను కొనసాగించారు. గైక్వాడ్ స్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్.. ఆసీస్ పై ఎదురుదాడికి దిగాడు. మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడుతున్నాడు. మరో ఓపెనర్ గిల్‌ కూడా అదే దూకుడును కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం క్రీజ్ లో గిల్ 76, శ్రేయస్‌ 76 పరుగులతో ఉన్నారు.

ఆసీస్ దూకుడుకు కళ్లెంవేసి ఒక వికెట్ పడ్డా ఇద్దరు బ్యాటర్లు గొప్పగా ఆడుతున్నారు. దీంతో భారత్ 170 పరుగులు పూర్తి చేసింది. ఈ మ్యాచ్కు టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా దూరమయ్యాడు. అతడి స్థానంలో ప్రసిద్ధ్ జట్టులోకి వచ్చాడు. అటు ఆసీస్ కూడా పలు మార్పులతో బరిలోకి దిగింది. ఆసీస్ కెప్టెన్గా స్టీవ్ స్మిత్ వ్యవహరిస్తున్నాడు. తొలి మ్యాచ్లో గెలిచిన టీమిండియా ఇవాళ కూడా ఆసీస్ను చిత్తు చేసి సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ సమం చేయాలని ఆసీస్ చూస్తోంది.

Updated : 24 Sep 2023 10:44 AM GMT
Tags:    
Next Story
Share it
Top