Home > క్రీడలు > Shubman Gill: అయ్యో గిల్.. ఇంకా హాస్పిటల్ బెడ్పైనే

Shubman Gill: అయ్యో గిల్.. ఇంకా హాస్పిటల్ బెడ్పైనే

Shubman Gill: అయ్యో గిల్.. ఇంకా హాస్పిటల్ బెడ్పైనే
X

వరల్డ్ కప్ సమరాన్ని టీమిండియా విజయంతో ప్రారంభించింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్ లో ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ పోరాటంతో.. ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్రస్తుతం టీమిండియా బుధవారం (అక్టోబర్ 11) ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే మ్యాచ్ కు రెడీ అవుతుంది. ఆ తర్వాత వరల్డ్ ఫేవరెట్ మ్యాచ్.. భారత్, పాకిస్తాన్ మధ్య పోరు ఉండనుంది. అయితే డెంగీతో బాధపడుతున్న టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్.. ఇప్పటికే మొదటి రెండు మ్యాచ్ లకు దూరం అవుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ క్రమంలో ఓ చేదు వార్త టీమిండియాను కలవర పెడుతుంది.

డెంగీ జ్వరంతో బాధపడుతున్న గిల్.. ఆసీస్ తో జరిగిన మ్యాచ్ తర్వాత చెన్నైలోనే ఉండిపోయిన విషయం తెలిసిందే. అక్కడి హాస్పిటల్ లో జాయిన్ అయి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అయితే తాజా రిపోర్ట్ లో గిల్ ప్లేట్ లెట్స్ పడిపోయినట్లు తేలింది. ప్లేట్ లెట్స్ సంఖ్య లక్షకంటే తక్కువకు పడిపోయినట్లు రిపోర్ట్ వచ్చిది. దాంతో ఈ నెల 14న అహ్మదాబాద్ వేదికపై పాకిస్తాన్ తో జరిగే కీలక మ్యాచ్ కు దూరం అయ్యాడు. మూడో మ్యాచ్ కు కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదని జాతీయ మీడియా పేర్కొంది.

Updated : 10 Oct 2023 9:48 PM IST
Tags:    
Next Story
Share it
Top