Home > క్రీడలు > మాక్స్వెల్ విధ్వంసం.. సెంచరీతో రికార్డు.. ఆసీస్ భారీ స్కోర్..

మాక్స్వెల్ విధ్వంసం.. సెంచరీతో రికార్డు.. ఆసీస్ భారీ స్కోర్..

మాక్స్వెల్ విధ్వంసం.. సెంచరీతో రికార్డు.. ఆసీస్ భారీ స్కోర్..
X

వరల్డ్ కప్లో భాగంగా నెదర్లాండ్స్ తో జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియా దంచికొట్టింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్, మాక్స్ వెల్ సెంచరీలతో హోరెత్తించారు. వార్నర్కు వరుసగా ఇది రెండో సెంచరీ కాగా.. మాక్స్వెల్ కేవలం 40 బంతుల్లోనే సెంచరీ కొట్టి రికార్డు సృష్టించాడు. స్టీవ్‌ స్మిత్ 71, లాబుస్చాగ్నే 62 రన్స్తో రాణించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ బీక్4, బాస్ డి లీడే 2, ఆర్యన్ దత్ ఒక వికెట్ పడగొట్టారు.

మాక్స్వెల్ విధ్వంసం..

వార్నర్ ముందు నుంచే దూకూడుగా ఆడాడు. ఓపెనర్ మార్ష్ 9పరుగులకే ఔట్ అయినా.. స్మిత్ తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వీరద్దరూ కలిసి 132 రన్స్ జోడించి జట్టుకు మంచి శుభారంభాన్ని ఇచ్చారు. ఇక 71 రన్స్ వద్ద స్మిత్ ఔట్ అవ్వగా.. ఆ తర్వాత వచ్చిన లాబుస్చాగ్నే కూడా హాఫ్ సెంచరితో ఆకట్టుకున్నాడు. చివర్లో బ్యాటింగ్ కు వచ్చిన మాక్స్ వెల్ విధ్వంసం సృష్టించాడు. నెదర్లాండ్స్ బౌలర్లను ఉతికారేశాడు. 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మాక్స్ వెల్.. 40 బాల్స్ లోనే సెంచరీ కొట్టి రికార్డు సృష్టించాడు. మాక్స్ వెల్ విధ్వంసంతో ఆసీస్ 399 స్కోర్ చేసింది.


Updated : 25 Oct 2023 1:41 PM GMT
Tags:    
Next Story
Share it
Top