అబ్బా.. మన సంప్రదాయాలంటే ఎంత గౌరవం.. సీమంతం కూడా.. ఫొటోలు వైరల్
X
విదేశీ ఆటగాళ్లు.. ముఖ్యంగా ఆసీస్ ఆటగాళ్లు భారత్ పై చూపించే ప్రేమ అమితమైనది. ఇక్కడి వ్యక్తులు, కల్చర్ ను ఎక్కువగా ప్రేమిస్తుంటారు. ఆస్ట్రేలియా ఆటగాడు, ఆర్సీబీ స్టార్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ కూడా భారతీయ అమ్మాయి వినీ రామన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అతని పెళ్లి వేడుక మొదట హిందూ సంప్రదాయం ప్రకారం, తర్వాత క్రిస్టియన్ ఆచారంలో జరిగింది.
అయితే, మ్యాక్ వెల్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. ప్రస్తుతం అతని భార్య వినీ కి ఈ మధ్య ఏడు నెలలు నిండాయి. దాంతో సోమవారం (జులై 23) దక్షిణ భారత ఆచారం ప్రకారం వలైకప్పు అంటే.. సీమంతం నిర్వహించారు. అచ్చమైన భారతీయ చీర కట్టు, బొట్టుతో వినీ మహాలక్ష్మిలా కనిపించింది. ఈ వేడుకకు వినీ కుటుంబ సభ్యులతో పాటు.. మ్యాక్స్ వెట్ ఫ్యామిలీ కూడా హాజరై ఇద్దరినీ ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫొటోలను వినీ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ‘బేబీ మ్యాక్స్ వెల్ కు మన సంప్రదాయంలో ఆశీర్వాదం’అని క్యాప్షన్ పెట్టింది. దాంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, వినీ మ్యాక్స్ వెల్ సెప్టెంబర్ లో తల్లిదండ్రులు కాబోతున్నారు.
తమిళనాడుకు చెందిన వినీ ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో ఫార్మసిస్ట్ గా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే మ్యాక్స్ వెల్ తో పరిచయం ఏర్పడింది. 2019లో ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డ్స్ లో వీళ్లిద్దరు జంటగా హాజరయ్యారు. అప్పుడే వీరి ప్రేమ వ్యవహారం ప్రపంచానికి తెలిసింది.