IND vs ENG : భారత్కు గుడ్ న్యూస్..మూడో టెస్ట్లో ఆడనున్న కోహ్లీ?
X
టీమిండియా, ఇంగ్లాండ్ టెస్ట్ లో కింగ్ కోహ్లీలేని లోటు స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు క్రికెట్ అభిమానులు. అసలు విరాట్ కు ఏమైంది? ఎక్కడున్నాడు? మళ్లీ జట్టులోకి ఎప్పుడు వస్తాడు అనే ప్రశ్నలు రోజు వినిపిస్తునే ఉన్నాయి. కాగా ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్టులకు వ్యక్తిగత కారాణాల వల్ల దూరమైన కోహ్లీ..సిరీస్ మొత్తానికి దూరంగా ఉంటాడన్న వార్త చక్కర్లు కొడుతుంది. అయితే తాజాగా ఇదే విషయంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు స్పందించారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలన్నీ రూమర్సే అని కొట్టిపారేశాడు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే మూడో టెస్టుకు విరాట్ అందుబాటులో ఉండే ఛాన్స్ ఉందని క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు.
విరాట్ కోహ్లి తను మూడో టెస్టుకు అందుబాటులో ఉండనని బీసీసీఐకు ఇప్పటివరకు అయితే చెప్పలేదని అన్నారు. విరాట్ కేవలం మొదటి రెండు టెస్టుల గురించి మాత్రమే బోర్డుకు సమాచారమిచ్చాడని చెప్పారు. ఒకవేళ అతడి నుంచి ఎటువంటి సమాచారం రాకపోతే జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నట్లేనని చెప్పుకొచ్చారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని బీసీసీఐ సీనియర్ అధికారి అన్నారు.
కాగా, విరాట్ సతీమణి అనుష్క ప్రెగ్నెంట్ గా ఉన్నందునే ఇంగ్లండ్ సిరీస్‌కు అతడు అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ కూడా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ ఈ వీక్ లో ప్రకటించే అవకాశం ఉంది.