కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన అనుష్క
X
విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త. విరాట్, అనుష్క శర్మ దంపతులు మరో బిడ్డకు జన్మనిచ్చారు. ఫిబ్రవరి 15వ తేదిన తనకు పండంటి మగబిడ్డ పుట్టాడని విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా నేడు వెల్లడించారు. తాజాగా తన బిడ్డ గురించి చెప్పడం ఎంతో ఆనందంగా ఉందని, రెండో బిడ్డకు అకాయ్ అనే పేరు పెడుతున్నట్లు కోహ్లీ తెలిపారు. ఇటువంటి సమయంలో తన ప్రైవసీని గౌరవించి తనను తన కుటుంబానికి ఆశీస్సులు అందించాలని కోహ్లీ అన్నారు. 2021, జనవరి 11వ తేదిన అనుష్క, కోహ్లీ దంపతులకు తొలిసారిగా వామిక జన్మించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తనకు మగబిడ్డ జన్మించిన విషయాన్ని తెలిపారు.
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ రెండో సారి తల్లిదండ్రులు అవ్వడంపై పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు. అనుష్క కూడా తన కుమారుడి గురించి చెబుతూ ఓ పోస్ట్ పెట్టింది. అనుష్క రెండోసారి గర్భం దాల్చిందని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై వారిద్దరూ క్లారిటీ ఇవ్వలేదు. కొన్నాళ్లకు ముందు దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కూడా ఓ ఇంటర్వ్యూలో అనుష్క ప్రెగ్నెన్సీ గురించి ప్రస్తావించాడు. అయితే ఆ వార్త నిజం కాదంటూ కొందరు కొట్టిపారేశారు. తాజాగా విరాట్ కోహ్లీ, అనుష్కశర్మ దంపతులు రెండోసారి బిడ్డకు జన్మనివ్వడం పట్ల సినీ సెలబ్రిటీలు, క్రికెటర్లు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు.