Under-19 WC : న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం
X
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్ – 19 వరల్డ్ కప్‌లో భారత కుర్రాళ్ల జైత్రయాత్ర కొనసాగుతోంది. ఓటమనేదే లేకుండా ఆడుతున్న భారత్.. సూపర్ సిక్స్‌లోనూ ఇరగదీస్తున్నది. గ్రూప్ స్టేజ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ విజయాలు సొంతం చేసుకున్న భారత్.. తాజాగా కివీస్‌తో జరిగిన సూపర్ సిక్స్ పోరులోనూ జయకేతనం ఎగురవేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 295 పరుగులు చేయగా,296 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 81 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
దీంతో భారత్ 214 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. సూపర్ సిక్స్‌లో యువ భారత్ మరో 3 మ్యాచులు ఆడుతుంది.. భారత బ్యాటర్ ముషీర్ ఖాన్ (131) సెంచరీతో చెలరేగాడు. బౌలర్లలో సౌమి పాండే 4 వికెట్లు తీశాడు.ఛేదనలో కివీస్ బ్యాటర్లు ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కును చేరుకోలేదు. కెప్టెన్ ఆస్కార్ జాక్సన్ 19 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కివీస్ జట్టులో నలుగురు బ్యాటర్లు సున్నా పరుగులకే పరిమితమవగా ముగ్గురు సింగిల్ డిజిట్ స్కోరు చేశారు. నలుగురు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేశారు.