Home > క్రీడలు > హారీస్ రౌఫ్ ఓవరాక్షన్.. ఇషాన్‌కి వేలు చూపిస్తూ వెళ్లిపొమ్మని..

హారీస్ రౌఫ్ ఓవరాక్షన్.. ఇషాన్‌కి వేలు చూపిస్తూ వెళ్లిపొమ్మని..

హారీస్ రౌఫ్ ఓవరాక్షన్.. ఇషాన్‌కి వేలు చూపిస్తూ వెళ్లిపొమ్మని..
X

ఆసియా కప్​లో భారత్ పాకిస్థాన్ మ్యాచ్​లో టీమ్ఇండియా బ్యాటర్లు హార్దిక్, ఇషాన్ అద్భుతంగా ఆడారు. వీరిద్దరూ ఐదో వికెట్​కు 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సెంచరీ దిశగా దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న ఇషాన్ కిషాన్ ను.. పాక్ బౌలర్ హారిస్ రవూఫ్ అవుట్ చేశాడు. 38వ ఓవర్ మూడో బంతిని ఇషాన్ భారీ షాట్ కొట్టడంతో బాబర్ ఆజామ్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో టీం ఇండియా ఐదో వికెట్ కోల్పోయింది. ఔటయ్యే సమయానికి ఇషాన్ కిషాన్ 82 పరుగులు చేశాడు. ఇషాన్ ఔట్ అయ్యాక రవూఫ్ ఓవరాక్షన్ చేశాడు. ఇషాన్ వైపు వేలు చూపిస్తూ.. ఇక వెళ్లు, వెళ్లు అన్నట్లుగా గట్టిగా అరిచాడు. అయితే ఆ తర్వాత రవూఫ్ వేసిన్ ఓవర్ లోనే హార్థిక్ 3 ఫోర్లు కొట్టి అతడి పొగరుకు ధీటైన సమాధానమిచ్చాడు.

ఇక 82 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై అత్యధిక స్కోరు బాదిన భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఇంతకుముందు 2008 ఆసియా కప్‌లో ధోనీ 76 పరుగులు చేయడమే ఆసియా కప్‌లో భారత వికెట్ కీపర్‌కి అత్యధిక స్కోరు. ఓవరాల్‌గా ఆసియా కప్‌లో భారత వికెట్ కీపర్‌గా మూడో అత్యుత్తమ స్కోరు నమోదు చేశాడు ఇషాన్ కిషన్. 2008లో హంగ్‌కాంగ్‌పై ధోనీ 109 పరుగులు చేయగా, 2004లో యూఏఈపై రాహుల్ ద్రావిడ్ 104 పరుగులు చేసి ఇషాన్ కిషన్ కంటే ముందున్నారు. వన్డే ఆసియా కప్ మొదటి మ్యాచ్‌లో అత్యధిక స్కోరు బాదిన మూడో భారత క్రికెటర్‌గా నిలిచాడు ఇషాన్ కిషన్. ఇంతకుముందు ధోనీ 109, సురేష్ రైనా 101 పరుగులు చేసి ఇషాన్ కిషన్ కంటే ముందున్నారు.

హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ కలిసి నెలకొల్పిన 138 పరుగుల భాగస్వామ్యం, ఇండియా వర్సెస్ పాకిస్తాన్‌ మ్యాచ్‌లో ఐదో వికెట్‌కి టీమిండియా తరుపున ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. ఇంతకుముందు 2004లో రాహుల్ ద్రావిడ్, యువరాజ్ సింగ్ కలిసి జోడించిన 133 పరుగుల భాగస్వామ్యాన్ని అధిగమించారు హార్ధిక్ - ఇషాన్ కిషన్..


Updated : 3 Sep 2023 3:07 AM GMT
Tags:    
Next Story
Share it
Top