Home > క్రీడలు > వరుసగా తేలిపోతున్న ఫ్యూచర్ కెప్టెన్.. అసలు ఆడాలని ఉందా..!

వరుసగా తేలిపోతున్న ఫ్యూచర్ కెప్టెన్.. అసలు ఆడాలని ఉందా..!

వరుసగా తేలిపోతున్న ఫ్యూచర్ కెప్టెన్.. అసలు ఆడాలని ఉందా..!
X

రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్ ఎవరంటే.. ఇదివరకు చాలామంది పేర్లు వినిపించాయి. అయితే, 2022 ఐపీఎల్ లో గుజరాత్ జట్టు పగ్గాలు అందుకుని, అనూహ్యంగా జట్టును ఫైనల్ చేర్చి.. కప్పు ఎగరేసుకుపోయాడు హార్దిక్ పాండ్యా. ఇక అప్పటి నుంచి టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ గా హార్దిక్ పేరునే చెప్తున్నారు. అంతేకాకుండా టీ20 వరల్డ్ కప్ తర్వాత నుంచి టీ20లకు రోహిత్, కోహ్లీలను దూరం పెడుతూ.. హార్దిక్ నేతృత్వంలో కుర్రాళ్లను ఎంపిక చేస్తున్నారు. ఇక టీమిండియా రాత మార్చుతూ.. ఐసీసీ ట్రోఫీ కరువును తీర్చుతాడు అనుకున్న ఫ్యూచర్ కెప్టెన్ వరుసగా తేలిపోతున్నాడు. టీ20 సంగతి అటుంచితే, వన్డే క్రికెట్ లో అసలు తనదైన ముద్ర వేయలేకపోతున్నాడు.

ఈ ఏడాది మొత్త 10 వన్డే మ్యాచులు ఆడిన హార్దిక్ తీవ్ర నిరాశ పరిచాడు. 10 మ్యాచుల్లో అతను చేసిన అత్యధిక స్కోరు 54 మాత్రమే. అంతేకాకుండా 23.33 సగటుతో 210 పరుగులు మాత్రమే చేశాడు. విండీస్ సిరీస్ లో రెండు మ్యాచుల్లో బ్యాటింగ్ చేసిన హార్దిక్.. 12 రన్స్ మాత్రమే చేశాడు. కష్టాల్లో ఉన్న టీంను గట్టెక్కించాల్సింది పోయి.. చెత్త షాట్స్ ఆడి ఫెయిల్ అవుతున్నాడు. టీ20ల్లోనూ నిరాశ పరుస్తున్నాడు. హిట్టర్ గా పేరున్న హార్దిక్ బ్యాటింగ్ లో ఆ మెరుపులు కనిపించడంలేదు. దీంతో బ్యాటింగ్ ఆర్డరే కాదు.. జట్టుకు కూడా భారంగా మారుతున్నాడు. కెప్టెన్సీ విషయం అటుంచితే హార్దికా ఫామ్.. వన్డే వరల్డ్ కప్ కు ముందు టీమిండియాకు దెబ్బ కొట్టేలా కనిపిస్తుంది.


Updated : 31 July 2023 12:47 PM GMT
Tags:    
Next Story
Share it
Top