ముంబై కెప్టెన్గా రోహిత్.. పాండ్యా కష్టమే..!
X
ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను కప్టెన్సీ నుంచి తప్పించడం చర్చనీయాంశంగా మారింది. 5 సార్లు ఐపీఎల్ కప్పులు అందించిన రోహిత్ను పక్కనబెట్టి.. హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలు అందించింది. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని కొంతమంది ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో రోహిత్ మళ్లీ కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది. వరల్డ్ కప్లో గాయపడిన పాండ్యా గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. ఇప్పటికే సౌతాఫ్రికా టూర్కు దూరమైన పాండ్యా ఆఫ్గనిస్తాన్ తో జరిగే టీ20 సిరీస్కు టీంలోకి వస్తాడని అంతా భావించారు. కానీ పాండ్యా ఐపీఎల్ ఆడడం కష్టమే అంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
గాయం ఇంకా తగ్గకపోవడంతో ఆఫ్గాన్తో సిరీస్ తోపాటు ఐపీఎల్‌లోనూ ఆడటం కష్టమేనని సమాచారం. అటు బీసీసీఐ సైతం అతడి విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదని టాక్. ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఒకవేళ కెప్టెన్సీని రోహిత్ వద్దనుకుంటే జట్టు సారథ్య బాధ్యతలను హార్దిక్ చేపట్టాల్సి ఉంటుంది. అందుకే బీసీసీఐ కూడా అతడికి రెస్ట్ ఇచ్చేందుకే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఐపీఎల్‌లో పాండ్యా ఆడడం లేదా ఆడకపోవడంపై ముంబయి ఇండియన్స్ ఇంతవరకు స్పందించలేదు.
ఒకవేళ హార్దిక్ పాండ్య దూరమైతే ముంబయి ఇండియన్స్‌ను నడిపించేదెవరనేది ఆసక్తిగా మారింది. అయితే మళ్లీ రోహిత్‌కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే కెప్టెన్సీ చేయడానికి రోహిత్ ఒకే అంటాడా లేదా అన్నది క్వశ్చన్ మార్క్. ఒకవేళ రోహిత్ కాదంటూ జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌లలో ఒకరిని కెప్టెన్‌ని చేయొచ్చు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు బుమ్రా నాయకత్వం వహించగా.. ఆసీస్, దక్షిణాఫ్రికాతో పొట్టి సిరీస్‌లకు సూర్యకుమార్ కెప్టెన్‌గా చేశాడు.