వరల్డ్కప్ నుంచి హార్దిక్ పాండ్యా ఔట్.. యువ బౌలర్కు చోటు
X
సెమీస్ ముంగిట టీమిండియాకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా టోర్నీ మొత్తానికి దూరం అయ్యాడు. ఈ విషయాన్ని ఐసీసీ ప్రకటించింది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ చేస్తుండగా.. బ్యాటర్ కొట్టిన బంతిని పాండ్యా కాలుతో ఆపే ప్రయత్నం చేశాడు. దాంతో బంతి పాండ్యా కాలుకు బలంగా తాకింది. ఆ క్షణం నొప్పితో విలవిల్లాడిన పాండ్యా మైదానాన్ని వీడి.. బెంగళూరులోని ఎన్సీఏలో చికిత్స తీసుకుంటున్నాడు. కోలుకున్ని తిరిగొస్తాడని అంతా ఆశించగా.. తాజాగా ఆ చీలమండ గాయం తీవ్రత పెరిగింది.
దీంతో బీసీసీఐ పాండ్యాకు విశ్రాంతినివ్వాలని నిర్ణయం తీసుకోగా.. పాండ్యా వరల్డ్ కప్ కు దూరం అయ్యాడు. హార్దిక్ పాండ్యా స్థానంలో యువ పేస్ బౌలర్ ప్రసిధ్ కృష్ణను బీసీసీఐ జట్టులోకి భర్తీ చేసింది. ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్ లు ఆడిన హార్దిక్ పాండ్యా.. ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఒక మ్యాచ్ లో మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. అందులో 11 పరుగులు చేసి నాటౌట్ గా నలిచాడు. ప్రస్తుతం జట్టులోని ప్లేయర్లంతా సూపర్ ఫామ్ లో ఉన్నారు. అయినా పాండ్యా లేకపోవడం జట్టులో వెలితే.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.