Home > క్రీడలు > World cup 2023: ప్రాక్టీస్ లో గాయం.. టీమిండియాకు మరో స్టార్ ప్లేయర్ దూరం

World cup 2023: ప్రాక్టీస్ లో గాయం.. టీమిండియాకు మరో స్టార్ ప్లేయర్ దూరం

World cup 2023: ప్రాక్టీస్ లో గాయం.. టీమిండియాకు మరో స్టార్ ప్లేయర్ దూరం
X

స్వదేశంలో వరల్డ్ కప్.. ప్లేయర్లంతా ఫామ్ బీకర ఫామ్ లో ఉన్నారు. హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. ఇక వరల్డ్ కప్ మనదే అనుకున్న టీమిండియా అభిమానులకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. వరల్డ్ కప్ ముంగిట గాయాలు, అనారోగ్యంతో టోర్నీకి దూరం అవుతున్నారు. దీంతో భారత జట్టుతో పాటు, అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నిన్న డెంగీ బారిన పడ్డ శుభ్ మన్ గిల్.. ఆస్ట్రేలియాతో జరిగే మొదటి మ్యాచ్ కు దూరం అయ్యాడు. అతని స్థానంలో ఇషాన్ కిషన్ ను జట్టులోకి ఓపెనర్ గా తీసుకుంటున్నారు. ఇప్పటికే అక్షర్ పటేల్ గాయంతో టోర్నీకి దూరం కాగా.. అతని స్థానంలో అశ్విన్ ను టీంలోకి తీసుకున్నారు. ఇక దాదాపు ఏడాదిగా జట్టుకు దూరం అయిన బుమ్రా, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఈమధ్యే భారత జట్టులో చేరిన విషయం తెలిసిందే. ఇక అంతాబాగేనే ఉంది అనుకున్న టైంలో మరో స్టార్ ప్లేయర్ గాయంతో జట్టుకు దూరం అయ్యాడు.

రేపు (అక్టోబర్ 8) ఆస్ట్రేలియాతో జరిగే మొదటి వరల్డ్ కప్ మ్యాచ్ కోసం నెట్స్ లో టీమిండియా తీవ్రంగా శ్రమిస్తుంది. కాగా తాజాగా నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న టైంలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య గాయపడ్డాడు. మహమ్మద్ సిరాజ్ వేసిన ఓ బౌన్సర్.. పాండ్యా వేలికి బలంగా తాకింది. దాంతో విలవిల్లాడిన పాండ్యా.. వెంటనే నెట్స్ వీడి డ్రెస్సింగ్ రూంకు చేరుకున్నాడు. రేపు జరిగే మ్యాచ్ సమయానికి పాండ్యా కోలుకోకపోతే భారత్ కు గట్టి ఎదురుదెబ్బ తగులుతుంది. ప్రస్తుతం పాండ్యా మంచి ఫామ్ లో ఉన్నాడు. గత సిరీసుల్లో అద్భుత ప్రదర్శన చేశాడు.

Updated : 7 Oct 2023 11:47 AM IST
Tags:    
Next Story
Share it
Top