కోపంతో ఊగిపోయిన టీమిండియా కెప్టెన్...వికెట్లను బ్యాట్‌తో కొట్టి..వీడియో వైరల్
X
బంగ్లాదేశ్ మహిళల జట్టు, భారత్ మధ్య జరిగి మూడు వన్డేల సిరీస్ 1-1తో సమం అయ్యింది. ఢాకా వేదికగా జరిగిన నిర్ణయాత్మక మూడో టైగా ముగియడంతో ట్రోఫీని ఇరుజట్లు పంచుకున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 225 పరుగులు చేసింది. అనంతరం భారత్ కూడా 225 పరుగులకే ఆలౌట్ కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. గెలుపుకు ఒక్క పరుగు దూరంలో నిలిచిపోవడం భారత్ ఆటగాళ్లను, అభిమానులను నిరాశపరిచ్చింది.
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్ తన సహనాన్ని కోల్పోయింది. అంపైర్ నిర్ణయంపై క్రీజ్‌లోనే తన అసంతృప్తిని బయటపెట్టింది. భారత ఇన్నింగ్స్ 34 ఓవర్ వేసిన నహిదా అక్తర్ బౌలింగ్‌లో మూడో బంతిని హర్మన్‌ప్రీత్ లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేసింది. అయితే బంతి బ్యాట్‌కు మిస్స్ అయ్యి ప్యాడ్‌కు తాకింది. బంగ్లా ఆటగాళ్లు ఎల్బీకి అప్పీల్ చేయగా..అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. దీంతో అంపైర్ నిర్ణయంపై హార్మన్ ప్రీత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోపంతో రగిలిపోయి వికెట్స్‌ను బ్యాట్‌తో కొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువరు హార్మన్ ప్రీత్ చర్యను తప్పుబడితే మరికొందరు మాత్రం అంపైర్‌ది తప్పుడు నిర్ణయమని మండిపడుతున్నారు.
Harmanpreet Kaur was not happy with the decision 👀#HarmanpreetKaur #IndWvsBangW #INDvWI pic.twitter.com/ZyoQ3R3Thb
— Ajay Ahire (@Ajayahire_cric) July 22, 2023