Home > క్రీడలు > రన్నింగ్ రేసులో 106 ఏళ్ల బామ్మకు గోల్డ్ మెడల్

రన్నింగ్ రేసులో 106 ఏళ్ల బామ్మకు గోల్డ్ మెడల్

రన్నింగ్ రేసులో 106 ఏళ్ల బామ్మకు గోల్డ్ మెడల్
X

వందేళ్ల వయసులో నడవడం, కూర్చోవడం చిన్న చిన్న పనులు చేసుకోవడమే చాలా కష్టంగా ఉంటుంది. కానీ అలాంటి వయసులోనూ ఓ బామ్మ రికార్డులు సృష్టిస్తోంది.సాధించాలనే తపన, మనసు ఉండాలే కానీ వయసుతో సంబంధం ఏముంది? సంకల్ప బలంతో స్వర్ణాలను సాధించవచ్చని నిరూపిస్తుస్తోంది . 106 ఏళ్ల వయసులోనూ 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని తగ్గేదే లేదంటూ అదరగొడుతోంది. జింకలా పరుగెత్తడమే కాదు బంగారు పతకాన్ని సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.


106 ఏళ్ల బామ్మ రామాబాయి సొంతూరు హరియాణాలోని చార్కి దాద్రి. ఈ బామ్మ తన తోటి వయసువారిలా ఇంట్లో కూర్చుని విరామం తీసుకోవాలనుకోలేదు. ఈ వయసులోనూ ఏదైనా సాధించాలనుకుంది. అందుకే ఉత్తరాఖండ్ దెహ్రాదూన్‎లో జరిగిన 18వ జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‎లో పాల్గొంది. అంతేకాదు 100 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం గెలుచుకుని అందరిని అవాక్కుచేసింది. కేవలం రన్నింగ్ రేస్‎తోనే ఆగిపోలేదు ఈ బామ్మ. ఆ తరువాత షాట్‎పుట్ పోటీల్లోనూ పాల్గొంది.


ఈ బామ్మతో పాటు మరో ఇద్దరు వృద్ధ దంపతులు ఈ పోటీల్లో భాగస్వామ్యులయ్యారు. వారి పెర్ఫార్మెన్స్‎తో అదరగొట్టారు. రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ 74 ఏళ్ల జైసింగ్ , అతడి భార్య 70 ఏళ్ల రమార్తి దేవి స్వర్ణాలను సాధించారు. హరియాణాకు చెందిన ఈ వృద్ధ జంట 3 కి.మి.ల నడక పోటీలో పాల్గొని స్వర్ణాలు గెలుచుకున్నారు. యువకులు సైతం ఇలాంటి పోటీల్లో పాల్గొని ఫిట్‎గా ఉండాలని ఈ దంపతులు సూచిస్తున్నారు.




Updated : 27 Jun 2023 2:54 AM GMT
Tags:    
Next Story
Share it
Top