26 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన RCB ఆల్రౌండర్.. కారణం ఏంటంటే?
X
శ్రీలంక స్టార్ ఆల్ రౌండర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక ఆటగాడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ మోజులో పడి 26 ఏళ్లకే టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మంగళవారం (ఆగస్ట్ 15) శ్రీలంక క్రికెట్ బోర్డ్ కు లేఖ రాసిన హసరంగ.. పరిమిత ఓవర్ల క్రికెట్ లో రాణించేందుకు టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు. హసరంగ నిర్ణయానికి శ్రీలంక క్రికెట్ బోర్డు ఆమోదం కూడా తెలిపింది.
టెస్టుల్లో కేవలం 4 మ్యాచులే ఆడిన హసరంగ.. 4 వికెట్లు పడగొట్టాడు. 2020 డిసెంబర్ లో సౌతాఫ్రికాపై అరంగేట్రం చేసిన హసరంగ.. 2021 ఏప్రిల్ లో బంగ్లాదేశ్ పై తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 48 వన్డేలు ఆడిన హసరంగ 67 వికెట్లు పడగొట్టాడు. 832 రన్స్ సాధించాడు. 58 టీ20ల్లో 91 వికెట్లు తీసి 533 రన్స్ చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో ఆర్సీబీ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. అలాగే పలు దేశాల టీ20 లీగ్ ల్లోనూ ఆడుతున్నాడు.
Wanindu Hasaranga retires from Test cricket to extend his limited-overs playing career.#WaninduHasaranga #SriLanka pic.twitter.com/6EndlbhzSC
— 100MB (@100MasterBlastr) August 15, 2023