World Cup 2023 : టీమిండియా అభిమానులకెప్పుడూ రుణపడి ఉంటాం: ఆఫ్ఘన్ కెప్టెన్
X
భారత్ లో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఎవరూ ఊహించని విధంగా రాణిస్తుంది. పసికూనగా టోర్నీలో అడుగుపెట్టి ప్రతాపం చూపెడుతుంది.పెద్ద జట్లతో సమానంగా సుమీస్ రేసులో నిలిచింది. సమిష్టి కృష్టితో పాయింట్స్ టేబుల్ లో 6వ స్థానంలో నిలిచింది. సెమీస్ ఆశల్ని సజీవంగా నిలుపుకుంది. కాగా ఆఫ్ఘన్ జట్టు సెమీస్ చేరాలంటే.. మిగిలిన రెండు మ్యాచ్ ల్లో తప్పక గెలవాలి. లేదాటే ఒక మ్యాచ్ లోనైనా భారీ తేడాతో విజయం సాధించాలి. ఈ క్రమంలో ఆఫ్ఘన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా అభిమానుల వల్లే తమ జట్టు గెలుస్తుందని చెప్పుకొచ్చాడు.
‘వరల్డ్ కప్ లో మా జట్టు ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. టీమిండియా అభిమానుల మద్దతు వల్లే మాకు ఇది సాధ్యం అయింది. ఆప్ఘన్ ఆడిన ప్రతీ మ్యాచ్ లో అభిమానులు స్టేడియానికి వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. అది మాకెంతో స్పూర్తినిస్తుంది. కేవలం గ్రౌండ్ లోనే కాదు.. బయటకు వెళ్లినప్పుడు కూడా వారి ఆధరణ అలానే ఉంది. మాలో ప్రతీ ఒక్కరిని ఎంతో గౌరవిస్తున్నారు. నేను ఒక ట్యాక్సీలో బయటికి వెళ్లాను. చివర్లో అతను డబ్బులు తీసుకోవడానికి నిరాకరించాడు. ఈ ఘటన చాలు మీరు మమ్మల్ని ఎంతగా ఇష్టపడుతున్నారో చెప్పడానికి. ఇంతకుముందు ప్రపంచకప్ లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచాం. ఇప్పుడు మెరుగైన ప్రదర్శన చేస్తున్నాం’అని హష్మతుల్లా షాహిది చెప్పాడు.