Home > క్రీడలు > IND vs AUS: భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు నిరసన సెగ.. ప్రేక్షకులు రావడం కష్టమే?

IND vs AUS: భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు నిరసన సెగ.. ప్రేక్షకులు రావడం కష్టమే?

IND vs AUS: భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు నిరసన సెగ.. ప్రేక్షకులు రావడం కష్టమే?
X

( IND vs AUS) ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రేపు (అక్టోబర్ 14) జరగనుంది. అహ్మదాబాద్ వేదికపై దాదాపు 1,32, వేల మంది ప్రేక్షకుల మధ్య ఈ పోరు జరగనుంది. ఇప్పటికే రెండు జట్టు అహ్మదాబాద్ చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. వరల్డ్ కప్ టోర్నీలో వరుసగా రెండు విజయాలతో ఉన్న ఇరు జట్లు.. హాట్రిక్ పై గురిపెట్టాయి. దీంతో దయాదుల మధ్య మరోసారి రసవత్తర పోరు ఖాయం అయింది. అయితే ఈ మ్యాచ్ కు నిరసన సెగ తగులుతోంది. ఈ మ్యాచ్ ను చూడొద్దంటూ ట్విటర్ లో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దీంతో ట్విట్టర్ లో #BoycottindoPakMatch, #BoycottBCCI ట్రెండింగ్ అవుతుంది.





‘పాకిస్తాన్, అక్కడి ఉగ్రవాదులు భారత సైనికులను చంపుతుంటే.. మనమేమో ఆ దేశ క్రికెటర్లను ఘనంగా సన్మానించి స్వాగతిస్తున్నాం. అమరులకు మనమిచ్చే గౌరవం ఇదేనా. అందుకే ఇండియా Vs పాకిస్తాన్ మ్యాచ్ ను బాయ్ కాట్ చేయాలి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో స్టేడియానికి ప్రేక్షకులు వస్తారా? లేదా? అనేది ప్రశ్నగా మారింది. ఇప్పటికే ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోగా.. హోటల్ సరిపోక జనాలు హాస్పిటల్ బెడ్స్ బుక్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. వరల్డ్ కప్ ఓపెనింగ్ సెర్మనీని భారత్, పాక్ మ్యాచ్ లో జరుపుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ మ్యాచ్ కోసం దేశంలోకి ప్రముఖులను ఆహ్వానించింది బీసీసీఐ. టాప్ సింగర్స్, యాక్టర్స్ తో సెర్మనీని ఏర్పాటుచేసింది.






Updated : 13 Oct 2023 12:26 PM IST
Tags:    
Next Story
Share it
Top