Home > క్రీడలు > Under-19 ODI World Cup : అండర్-19 వరల్డ్ కప్: అమెరికాపై ఘనవిజయం సాధించిన భారత్

Under-19 ODI World Cup : అండర్-19 వరల్డ్ కప్: అమెరికాపై ఘనవిజయం సాధించిన భారత్

Under-19 ODI World Cup : అండర్-19 వరల్డ్ కప్: అమెరికాపై ఘనవిజయం సాధించిన భారత్
X

(Under-19 ODI World Cup) అండర్‌-19 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ హ్యాట్రిక్‌ సాధించింది. గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో 201 పరుగుల భారీ తేడాతో అమెరికాపై ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 326 పరుగులు చేసింది. ఓపెనర్ అర్షిన్‌ కులకర్ణి 108 అద్భుతమైన సెంచరీతో రాణించాడు. ముషీర్‌ఖాన్‌ 73 కూడా సత్తా చాటాడు. ముషీర్‌తో కలిసి అర్షిన్‌ రెండో వికెట్‌కు 155 పరుగుల భారీ స్కోరును జత చేసి ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశాడు. కెప్టెన్ ఉదయ్‌ 35, ప్రియాంశు 27, ఆదర్శ్‌ 25, సచిన్‌దాస్‌ 20 పరుగులు సాధించడంతో భారత్‌ భారీ స్కోరు చేసింది. అనంతరం, 327 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన అమెరికా జట్టు భారత్ బౌలర్ల ముందు చతికిలపడింది. నిర్ణిత

50 ఓవర్లలో 8 వికెట్లకు 125 పరుగులే చేసింది. ఛేదనలో బౌలర్ నమన్‌ తివారి 20 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టి అమెరికాకు కొలుకోలేని షాక్ ఇచ్చాడు. ఉత్కర్ష శ్రీవాత్సవనే 40 టాప్‌ స్కోరర్‌. నమన్‌తో పాటు రాజ్‌ లింబాని, సౌమీ పాండే, అభిషేక్‌, ప్రియాంశు తలో వికెట్ తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ టోర్నీలో జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్‌, ఐర్లాండ్‌పై నెగ్గిన భారత్‌... ప్రస్తుతం 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.




Updated : 29 Jan 2024 6:51 AM IST
Tags:    
Next Story
Share it
Top