Home > క్రీడలు > ICC World Cup2023: వరల్డ్కప్ భద్రతపై హైద‌రాబాద్ పోలీసుల ఆందోళన

ICC World Cup2023: వరల్డ్కప్ భద్రతపై హైద‌రాబాద్ పోలీసుల ఆందోళన

ICC World Cup2023: వరల్డ్కప్ భద్రతపై హైద‌రాబాద్ పోలీసుల ఆందోళన
X

thumb: షెడ్యూల్ మార్చాలి.. HCA లేఖ

మరో 46 రోజుల్లో వరల్డ్ కప్ సమరం ప్రారంభం కానుంది. తుది షెడ్యూల్ కు ఐసీసీ సహా అన్ని దేశాల ఆమోదం లభించింది. ఇప్పటికే కొన్ని జట్లు తమ టీంను ప్రకటించాయి. బీసీసీఐ టికెట్ల అమ్మకాలను మొదలుపెట్టింది. స్టేడియాలన్నీ టోర్నీకోసం ముస్తాబవుతున్నాయి. ఫ్యాన్స్ లో ఉత్కంఠ మొదలయింది. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు బాంబు పేల్చారు. వరల్డ్ కప్ కు భద్రత కల్పించడం తమ వల్ల కాదంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు తెలిపింది. దీంతో హెచ్సీఏ హైదరాబాద్ లో జరిగే మ్యాచ్ ల షెడ్యూల్ మార్చాలని బీసీసీఐ లేఖ రాసింది.

ఉప్పల్ స్టూడియంలో అక్టోబర్ 9న న్యూజిలాండ్-నెదర్లాండ్స్, 10న పాకిస్తాన్-శ్రీలంక మ్యాచ్ లు జరగాల్సి ఉంది. అయితే వరుస రెండు రోజులు మ్యాచ్ లు ఉన్నందున.. తగిన భద్రత కల్పించడం తమకు కష్టమవుతుందని హైదరాబాద్ పోలీసులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు తెలిపారు. దీంతో హైదరాబాద్ పోలీసుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హెచ్సీఏ.. షెడ్యూల్ మార్చాలని బీసీసీఐకి లేఖ రాసింది. ఈ వార్త తెలిసిన ఫ్యాన్స్ లో ఆందోళన మొదలయింది. అసలే హైదరాబాద్ లో టీమిండియా మ్యాచులు లేక నిరాశలో ఉంటే.. మధ్యలో ఈ ట్విస్ట్ ఏంటని ఫైర్ అవుతున్నారు. హెచ్సీఏ లేఖతో బీసీసీఐ ఆగ్రహించి ఉన్న మ్యాచ్ లను కూడా వేరే వేదికకు మార్చితే పరిస్థితి ఏంటని మండిపడుతున్నారు.

HCA ask BCCI to change the schedule of World Cup matches

ODI World Cup,icc World Cup2023,World Cup 2023 Schedule,Hyderabad Police,Security Concerns,HCA, hyderabad cricket assosiation,letter to BCCI,ICC

Updated : 20 Aug 2023 8:52 PM IST
Tags:    
Next Story
Share it
Top