Home > క్రీడలు > విషాదం.. లెజండరీ క్రికెటర్‌ హీత్ స్ట్రీక్ కన్నుమూత..

విషాదం.. లెజండరీ క్రికెటర్‌ హీత్ స్ట్రీక్ కన్నుమూత..

విషాదం.. లెజండరీ క్రికెటర్‌ హీత్ స్ట్రీక్ కన్నుమూత..
X

జింబాబ్వే మాజీ క్రికెటర్ హీత్ స్ట్రీక్(49) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన.. మటబెలెలాండ్‌లో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో ఆఖరి శ్వాస విడిచారు. ఈ విషయాన్ని జింబాబ్వే అంతర్జాతీయ ప్రతినిధి జాన్ రెనీ స్పష్టం చేశారు. క్యాన్సర్‌తో ఇబ్బందిపడుతున్న హీత్ స్ట్రీక్.. తన కుటుంబసభ్యుల సమక్షంలో ప్రశాంతంగా కన్నుమూశారని రెనీ ఓ ప్రకటనలో వెల్లడించారు. హీత్ స్ట్రీక్ మరణించిన విషయాన్ని అతడి భార్య నడైన్‌ స్ట్రీక్‌ కూడా సోషల్‌ మీడియా వేదికగా తెలియజేసింది."ఈ రోజు ఉదయం నా జీవితంలో సగం, నా అందమైన పిల్లల తండ్రి మమ్మల్ని విడిచి అందరాని లోకాలకు వెళ్లిపోయారు. అతను తన చివరి రోజులను ఫ్యామిలీ, అత్యంత సన్నిహితులతో గడపాలని కోరుకున్నారు. స్ట్రీక్‌ మాతో ​గడిపిన క్షణాలు ఎ‍ప్పటికీ మర్చిపోలేనవి. స్ట్రీకీ మరో జన్మలో కూడా నీ భార్యగానే పుట్టాలని కోరుకుంటున్నా అంటూ" ఆమె భావోద్వేగానికి లోనైంది.

కొన్ని రోజుల క్రితమే హీత్ స్ట్రీక్ మరణించాడన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో తాను బాగానే ఉన్నాడని కుటుంబీకులు వెల్లడించిన విషయం తెలిసిందే. జింబాబ్వే మాజీ బౌలర్ హెన్రీ ఒలాంగా హీత్‌ స్ట్రీక్‌ మరణించాడంటూ అభిమానులను గందరగోళానికి గురిచేశాడు.ఆ తర్వాత మళ్లీ కొద్దిసేపటికే బతికే ఉన్నాడంటూ ట్విట్‌ చేసి తన తప్పును సరిదిద్దుకున్నాడు. కానీ ఇప్పుడు నిజంగానే స్ట్రీక్‌ అందరిని విడిచి పెట్టి అందరాని లోకాలకు వెళ్లిపోయారు.

కాగా జింబాబ్వే క్రికెట్‌ చరిత్రలోనే హీత్‌ స్ట్రీక్‌ గ్రేటెస్ట్‌ ఆల్‌రౌండర్‌. క్‌ 1993లో ఆ దేశం తరఫున అంతర్జాతీయ కెరీర్‌ ప్రారంభించి 65 టెస్ట్‌లు (216 వికెట్లు, సెంచరీ, 11 హాఫ్‌ సెంచరీలు), 189 వన్డేలు (239 వికెట్లు, 13 హాఫ్‌ సెంచరీలు) ఆడాడు. అతను తన చివరి మ్యాచ్‌ను 2005లో ఆడాడు. స్ట్రీక్‌ 21 టెస్ట్‌ల్లో, 68 వన్డేల్లో జింబాబ్వే కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. 2021లో స్ట్రీక్ అవినీతికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొని, ఎనిమిదేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిషేధానికి గురయ్యాడు.


Updated : 3 Sep 2023 7:25 AM GMT
Tags:    
Next Story
Share it
Top