చరిత్ర సృష్టించిన అశ్విన్...కుంబ్లే రికార్డ్ బద్దలు
X
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే రికార్డును అశ్విన్ బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. రాంచీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచులో అశ్విన్ ఈ ఘనతను సాధించాడు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఆటగాళ్లను వరుస బంతుల్లో బెన్ డకెట్, ఓలీపోప్‌లను ఔట్ చేసి పెవిలియన్ పంపిచాడు. దీంతో కుంబ్లే రికార్డును తిరగరాస్తూ..స్వదేశంలో అశ్విన్ తీసిన వికెట్ల సంఖ్య 352కి చేరింది.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.