క్రికెట్ ఫ్యాన్స్కు కిక్కిచ్చేలా సరికొత్త ఫీచర్లతో హాట్ స్టార్...
X
అక్టోబర్ 5 నుంచి క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో డిస్నీప్లస్ హాట్ స్టార్ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త ఫీచర్లతో క్రికెట్ ఫ్యాన్స్ కు మరింత కిక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. వీక్షకులకు కొత్త అనుభూతిని అందించేందుకు ఈ మార్పులు చేపట్టినట్లు సంస్థ తెలిపింది. హాట్ స్టార్ ఇప్పటికే వరల్డ్‌కప్ మ్యాచ్‌లను మొబైల్ యాప్‌లో ఫ్రీగా చూసే అవకాశం కల్పిస్తోంది. అయితే ఇది కేవలం మొబైల్ యూజర్లకు మాత్రమే అని స్పష్టం చేసింది.
మొబైల్ యూజర్ల కోసం డిస్నీప్లస్ హాట్‌స్టార్ మ్యాక్స్ వ్యూ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఐసీసీతో కలిసి హాట్ స్టార్ ఈ సదుపాయాన్ని అందిస్తోంది. దీంతో వర్టికల్ మోడ్‌లో క్రికెట్‌ను వీక్షించొచ్చు. ఈ మోడ్‌లో లైవ్ ఫీడ్ ట్యాబ్, స్కోర్ కార్డు ట్యాబ్ కూడా కనిపిస్తాయి. దీంతో పాటు యూజర్ తనకు నచ్చిన ప్లేయర్‌ను మ్యాక్స్‌వ్యూ మోడ్‌లో వీక్షించొచ్చు. ఇక హైక్వాలిటీలో మ్యాచ్‌లు వీక్షించినప్పటికీ తక్కువ డేటా ఖర్చయ్యే విధంగా తమ యాప్‌ను అప్‌డేట్ చేసినట్లు డిస్నీప్లస్ హాట్‌స్టార్ తెలిపింది.
కాగా డిస్నీప్లస్ హట్‌స్టార్ ఫ్రీ కంటెంట్‌ను, పెయిడ్ కంటెంట్‌ను వేర్వేరుగా చూపిస్తుంది. దీంతో సబ్స్క్రిష్షన్ లేని యూజర్లు ఫ్రీ కంటెంట్ను సెలక్ట్ చేసుకోవచ్చు. అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్‌లు మొబైల్ యాప్‌లో మాత్రమే ఫ్రీగా లభిస్తాయి. డెస్క్ టాప్ వెర్షన్లో వీక్షించాలంటే మాత్రం హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. అంతేకాకుండా కొత్తగా కమింగ్‌సూన్ ట్రే తీసుకొచ్చింది. దీంతో అప్ కమింగ్ కంటెంట్ ఉంటుంది. వాటిల్లో నచ్చిన వాటికి రిమైండర్ సెట్ చేసుకోవచ్చు.