Home > క్రీడలు > నేను అతని బౌలింగ్కి పెద్ద ఫ్యాన్... Ashwin

నేను అతని బౌలింగ్కి పెద్ద ఫ్యాన్... Ashwin

నేను అతని బౌలింగ్కి పెద్ద ఫ్యాన్... Ashwin
X

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Bumrah)పై తన సహచర ఆటగాడు దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ashwin) ప్రశంసల జల్లు కురిపించాడు . వైజాగ్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో గెలుపుపై ఆయన స్పందించాడు. బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడని కొనియాడాడు. అసలుసిసలైన ప్రదర్శన చేసిన అత్యుత్తమ ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా అని ప్రశంసించాడు. అద్భుతంగా బౌలింగ్ చేసినందు వల్లే..ప్రస్తుతం 14 వికెట్లతో టాప్ ప్లేస్ లో ఉన్నాడని, టెస్ట్ బౌలర్‌గా నంబర్ 1 ర్యాంక్‌లో ఉన్నాడన్నాడు. నెంబర్ 1 ర్యాంకు సాధించడమంటే హిమాలయ శిఖరాన్ని తాకడమేనని, తాను కూడా బుమ్రాకు పెద్ద ఫ్యాన్ నని అశ్విన్ చెప్పాడు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానెల్‌లో అశ్విన్ మాట్లాడాడు. కాగా బుమ్రా ప్రస్తుతం వరల్డ్ నెంబర్ 1 టెస్ట్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌పై జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో రాణించడం ద్వారా తన స్థానాలను చాలా బాగా మెరుగుపరచుకున్నాడు. వైజాగ్ లో ఇంగ్లాడ్ తో జరిగిన టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 45 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు.

ఇంగ్లండ్, ఇండియా టెస్టు సిరీస్‌లో బుమ్రా అద్భుతంగా రాణిస్తున్నాడని అన్నాడు. ఇక వైజాగ్ టెస్టులో ఇంగ్లండ్‌కు 399 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంతో తన సెంచరీతో కీలక పాత్ర పోషించిన యంగ్ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్‌ను కూడా అశ్విన్ మెచ్చుకున్నాడు. క్రికెట్ లో ఎంతో అనుభవజ్ఞుడిలా ఆడాడని కొనియాడాడు. శుభ్‌మాన్ గిల్‌ ప్రతిభపై ఎలాంటి సందేహం లేదని, సెంచరీలు సాధించగల సమర్థవంతమైన ఆటగాడని చెప్పుకొచ్చాడు. ఇదిలావుండగా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక మైలురాయి అందుకునేందుకు దగ్గరలో ఉన్నాడు. మరో వికెట్ తీస్తే టెస్టులో 500 వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించనున్నాడు.





Updated : 11 Feb 2024 4:54 AM GMT
Tags:    
Next Story
Share it
Top