Prithvi Shaw : నేను భవిష్యత్ గురించి ఆలోచించడం లేదు..పృథ్వీ షా
X
ఇండియా యంగ్ క్రికెటర్ పృథ్వీ షా రంజీ ట్రోఫీలో తన సత్తా చాటుతున్నాడు. ఒకానొక టైంలో గాయాలు, ఫామ్ లో లేక ఇబ్బందులు పడ్డ షా ఇప్పుడు రంజీ ట్రోఫీలో అద్భుతమైన సెంబరీతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. మరోవైపు కొన్నాళ్ల క్రితం సోషల్ మీడియా మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్‌తో గొడవలు ఏర్పడ్డాయి. కాగ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆరోపణలు నిరాధారమైనవని తేలగా ఎట్టకేలకు షాకు వీటి నుంచి విముక్తి లభించింది.
ముంబై జట్టులో కీ ప్లేయర్ గా ఉన్న అతను.. ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో భారీ శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. 185 బంతుల్లో 18 ఫోర్లు, మూడు సిక్సర్లతో 159 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీమిండియాకు తన పునరాగమనం పై ప్రశ్నించగా అలాంటి ఆలోచనలు ఇప్పుడు లేవని చెప్పాడు. ప్రస్తుతం తన దృష్టంతా ముంబై జట్టుకు రంజీ ట్రోఫీ అందించడంపైనే ఉందని స్పష్టం చేశాడు. అంతేగాక తను భవిష్యత్ గురించి ఆలోచించడం లేదనీ.. వర్తమానంపై దృష్టి పెడుతున్నానని చెప్పాడు. గాయం నుంచి కోలుకొని మళ్లీ క్రికెట్ ఆడడం ఎంతో సంతోషంగా ఉందన్నాడు. ముంబై జట్టుకు రంజీ ట్రోఫీ అందించేందుకు తను చేయగలిగినంత చేస్తానని షా ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
అయితే ఇంగ్లాండ్ పర్యటనలో పృథ్వీ అక్కడ అదరగొట్టాడు. నార్తాంప్టన్‌షైర్ జట్టు తరుపున 4 మ్యాచ్‌ల్లో 143 సగటుతో 429 పరుగులు చేశాడు. అలా మంచి ఫామ్‌లో ఉన్న టైంలో మోకాలికి దెబ్బ తగిలింది. దీంతో మూడు నెలల పాటు క్రికెట్ ఆడలేదు. ఒకప్పుడు భారత క్రికెట్ భవిష్యత్తుగా చూసిన షా, మళ్లీ ఆ ఫామ్ తో టీమిండియాకు ఎంపికవ్వాలని క్రికెట్ లవర్స్ కొరుకుంటున్నారు.