Home > క్రీడలు > మా కుటుంబంలో చీలికలు రావడానికి జడేజా భార్యే కారణం

మా కుటుంబంలో చీలికలు రావడానికి జడేజా భార్యే కారణం

మా కుటుంబంలో చీలికలు రావడానికి జడేజా భార్యే కారణం
X

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన బౌలింగ్, ఫీల్డింగ్ తో జట్టుకు వెన్నుముకలా నిలబడతాడు. జట్టుకు అతను అందించిన విజయాలు అనేకం. క్రికెటర్ గా ఎంత కూల్ గా ఉంటాడో.. వ్యక్తిగతంగా అంతే హుందాగా ఉంటాడు. అనవర విషయాలతో ఎప్పుడూ వార్తల్లో నిలబడలేదు. జడేజా భార్య రివాబా జడేజా కూడా అంతే. ఒక ఎమ్మెల్యే అనే గర్వం లేకుండా.. అందరితో కలుపుగోలుగా ఉంటుంది. ఇదిలా ఉండగా.. రవింద్ర జడేడా తండ్రి.. వారిపై తీవ్ర ఆరోపణలు చేశాడు. రివాబా వల్ల కుటుంబంలో చీలికలు వచ్చాయని మీడియా ముఖంగా చెప్పుకొచ్చాడు.

జడేజా తంత్రి అనిరుధ్ సింగ్.. చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రివాబాతో పెళ్లి జరిగినప్పటి నుంచి.. నా కొడుకుతో సంబంధాలు తెగిపోయాయని అన్నారు. వాళ్ల ఫ్యామిలీలో చీలికలు రావడానికి రివాబా కారణమని ఆరోపించాడు. ఒకే ఊరిలో ఉంటున్నా.. కొడుకు ముఖం చూసే భాగ్యం దక్కట్లేదని చెప్పారు. జడేజా అతని భార్య రివాబాతో మాకు, మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. మేం వారికి ఇంటికి పిలవము, వాళ్లు మాకు ఫోన్ చేసి యోగక్షేమాలు పట్టించుకోరు. జడేజా పెళ్లైన రెండుమూడు నెలల తర్వాత ఈ సమస్యలు మొదలయ్యాయని అనిరుధ్ సంచలన ఆరోపణలు చేశాడు.

తాను ప్రస్తుతం జామ్ నగర్ లో ఒంటరిగా ఉంటున్నాడని, జడేజా, అతని కుటుంబం తన బంగ్లాలో ఉంటుందని చెప్పుకొచ్చాడు. ‘రివాబా ఏం చేసిందో ఏమో.. నా కొడుకు మనసు మారిపోయింది. నేను జడేజా పెళ్లి చేయకపోయినా బాగుండేది. క్రికెటర్ కాకపోయుంటే ఇంకా బాగుండేది. అది జరిగితే ఇన్ని సమస్యలు వచ్చేవి కావు. ఇవన్నీ అనుభవించాల్సిన అవసరం వచ్చేది కాద’ని జడేజా తండ్రి అనిరుధ్ చెప్పుకొచ్చాడు.





Updated : 9 Feb 2024 4:37 PM IST
Tags:    
Next Story
Share it
Top