క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ఈసారి ఫార్మట్ మారింది.. 20 జట్ల మధ్య సమరం
X
టీ20 క్రికెట్ లో కీలక మార్పుకు ఐసీసీ రంగం సిద్ధం చేస్తోంది. 2024లో వెస్టిండీస్, అమెరికా సంయుక్త ఆతిథ్యంలో జరగబోయే వరల్డ్ కప్ కోసం సన్నద్ధాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓ వార్త నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. జూన్ 4 నుంచి జూన్ 30 వరకు టోర్నీ జరుగనున్నట్లు తెలుస్తోంది. రెండు దేశాల్లో కలిపి పది స్టేడియాల్లో ఈ టోర్నీని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే ఐసీసీ.. అమెరికాలోని స్టేయాలను సందర్శించింది. అందులో కొన్నింటికి అంర్జాతీయ హోదా లేని కారణంగా.. ఆ విషయంపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఈ క్రమంలో గతంతో పోల్చితే ఈసారి టీ20 వరల్డ్ కప్ కాస్త భిన్నంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
జూన్ 4న మొదలై 26 రోజులపాటు సాగే ఈ టోర్నీలో ఈసారి మొత్త 20 దేశాలు పాల్గొనబోతున్నాయి. ఆ 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూపులోని టాప్ 2లో నిలిచిన జట్టు సూపర్ - 8కు అర్హత సాధిస్తుంది. ఆ ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విడగొడతారు. ఈ రెండు గ్రూపుల్లో టాప్ - 2 నిలిచిన నాలుగు జట్లు జట్లు సెమీస్ అర్హత సాధిస్తాయి. కాగా, పోయిన ఎడిషన్ లో జోస్ బట్లర్ నేతృత్వంలో ఇంగ్లండ్ జట్టు ఫైనల్ చేరి పాకిస్తాన్ ను ఓడించిన విషయం తెలిసిందే.